‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ రివ్యూ

‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ రివ్యూ
సరదాగా నవ్వుకోడానికి ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’
బ్యానర్ : యు.వి. క్రియేషన్స్‌
నటీనటులు: శర్వానంద్‌, సురభి, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను,
పోసాని, హరీష్‌ ఉత్తమన్‌, సప్తగిరి, సుప్రీత్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: 14.01.2016

యు.వి. క్రియేషన్స్‌ బేనర్‌ ‘రన్‌ రాజా రన్‌’ వంటి సూపర్‌హిట్‌ మూవీ చేసిన శర్వానంద్‌ మళ్ళీ అదే బేనర్‌లో రెండో సినిమాగా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చేశాడు. తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సూపర్‌హిట్‌ కొట్టిన మేర్లపాక గాంధీ తన రెండో సినిమాకి కూడా ఎక్‌ప్రెస్‌ని వదిలిపెట్టకుండా శర్వానంద్‌తో ఈ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చేశాడు. వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్స్‌ప్రెస్‌లా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు ఇంప్రెస్‌ చెయ్యగలిగింది? శర్వానంద్‌ యు.వి. క్రియేషన్స్‌లో రెండో హిట్‌ కొట్టాడా? మేర్లపాక గాంధీ తన రెండో హిట్‌ సాధించాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
ఒక అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించి ఆమె కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడని మన తెలుగు సినిమాల్లోని హీరోలు ఎక్కువ శాతం ఏ పనీ పాటా లేకుండానే వుంటారు. అలాంటి హీరో ఈ సినిమాలో కూడా వున్నాడు. అతని పేరు రాజా(శర్వానంద్‌). కొన్ని కారణాల వల్ల వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రాజా తొలిచూపులోనే హీరోయిన్‌ అమూల్య అలియాస్‌ అమ్ము(సురభి)ని ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్‌ చెయ్యడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. డిక్షనరీలు అమ్ముకుంటూ తిరిగే హీరో ఆ అమ్మాయికి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చెయ్యడం కోసం నానా తంటాలు పడతాడు. చివరికి ఆ అమ్మాయి కూడా తన సైడ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆ టైమ్‌లో తన ఇష్టానికి వ్యతిరేకంగా రాజా చేసిన పని అమ్ముకి నచ్చదు. దాంతో ఐ హేట్‌ యూ అంటూ వెళ్ళిపోతుంది. ఇంతకీ అమ్ముకి ఇష్టమైంది ఓ కుక్కపిల్ల. కుక్కలంటే పడని రాజా ఆమె పెంచుకునే కుక్కని మున్సిపాలిటీ లారీలో ఎక్కించి పంపించేస్తాడు. అది అమ్ముకి ఎంతో ఇష్టమైందని తెలుసుకొని కుక్క కోసం వేట మొదలు పెడతాడు. ఆ కుక్క వేరే వాళ్ళకు చేరడంతో అక్కడ్నించి కథ టర్న్‌ తీసుకుంటుంది. ఓ పక్క అమూల్యకి ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంది. ఆ తర్వాత రాజాకి సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల నుంచి రాజా ఎలా బయటపడ్డాడు? రాజాని ప్రేమించిన అమూల్య వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ జరగడానికి రీజన్‌ ఏమిటి? చివరికి అమూల్యను రాజా పెళ్ళి చేసుకున్నాడా? అనేది తెరపై చూడాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌:
గతంలో శర్వానంద్‌ చేసిన సినిమాల్లో అతని పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుందో ఇందులోనూ అంతే వుంది. అంతకు మించి ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే అతని హెయిర్‌ స్టైల్‌ని ఎన్టీఆర్‌ స్టైల్‌కి దగ్గరగా వుండేలా మార్చారు. సినిమాలో ఎక్కువ శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ వున్నా అది హీరో క్యారెక్టర్‌ నుంచిగానీ, అతని పెర్‌ఫార్మెన్స్‌ నుంచి గానీ వచ్చింది కాదు. ఇక హీరోయిన్‌ సురభి ఒకటి రెండు పాటల్లో, కొన్ని సీన్స్‌లో, ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. అంతకు మించి పెర్‌ఫార్మ్‌ చెయ్యడానికి కూడా ఆమెకు అవకాశం లేదు. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే బాధ్యతను ఎక్కువగా భుజాన వేసుకున్నవాడు సప్తగిరి. అతను కథలో ఎంటర్‌ అయిన దగ్గర నుంచి సినిమా ఎండ్‌ అయ్యే వరకు దాదాపు ప్రతి సీన్‌లోనూ వున్నాడని చెప్పాలి. అతను కనిపించిన ప్రతి సారీ, డైలాగ్‌ చెప్పిన ప్రతి సారీ ఆడియన్స్‌కి నవ్వడానికి అవకాశం దొరికింది. ఇప్పటివరకు విలన్‌గానే చూసిన సుప్రీత్‌ని ఈ సినిమాలో కొంత కామెడీ టచ్‌ వున్న క్యారెక్టర్‌లో చూస్తాం. బిల్‌ గేట్స్‌గా బ్రహ్మాజీ ఓకే అనిపించాడు. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా వుండే కేశవరెడ్డిగా హరీష్‌ ఉత్తమన్‌ పెర్‌ఫార్మెన్స్‌ అతని గత చిత్రాల్లో వున్నట్టే వుంది. అతని తల్లి వసంత కోకిలగా చేసిన ఊర్వశి కొన్నిచోట్ల నవ్వించినా, మరికొన్ని చోట్ల తన ఓవర్‌ యాక్షన్‌తో విసిగిస్తుంది. రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌ లీడర్‌గా షకలక శంకర్‌కి కూడా నవ్వించే అవకాశం తక్కువగా లభించిందని చెప్పాలి.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:
ఘట్టమనేని కార్తీక్‌ ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఈ కథకి ఫోటోగ్రఫీలో వండర్స్‌ చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా కార్తీక్‌ చాలా రిలాక్స్‌డ్‌గా తీసినట్టు తెలుస్తుంది. ప్రవీణ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే అనిపించాడు. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వించడమే ధ్యేయంగా ఈసినిమా చేసినట్టు కథను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఎంత కామెడీ సినిమా అయినా కొన్నిచోట్ల బోర్‌ ఫీల్‌ అవ్వక తప్పదు. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఆడియన్స్‌కి బాగా నవ్వు తెప్పిస్తాయని గాంధీ భావించిన సీన్స్‌ని కాస్త ఎక్కువ సేపు రన్‌ చేసేసరికి ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యారు. సెకండాఫ్‌లో పరిచయమయ్యే క్యారెక్టర్లకి సంబంధించి ఫ్లాష్‌ బ్యాక్‌ చూపించడానికి వారి ఫ్లాష్‌బ్యాక్‌ని ఎక్కువ సార్లు వెయ్యడం చాలా బోర్‌ అనిపిస్తుంది. కథకు అవసరం లేకపోయినా హీరో కుక్కని అసహ్యించుకునే సీన్స్‌ని రిపీట్‌ చెయ్యడం, కుక్కలను చంపెయ్యమని చెప్పడం, మున్సిపాలిటీవారు కూడా వీధి కుక్కలను చంపేస్తామని హీరోతో అనడం చాలా ఎబ్బెట్టుగా వుంది.

విశ్లేషణ:
హీరోయిన్‌ని ఇంప్రెస్‌ చెయ్యడానికి హీరో పదే పదే కలుసుకోవాలని, మాట్లాడాలని ట్రై చెయ్యడం, వాళ్ళు ప్రతిసారీ ఒక మార్కెట్‌లో కలుసుకోవడం, హీరో డిక్షనరీలు అమ్మే సీన్స్‌ ఎక్కువ సార్లు చూపించడం వంటి సీన్స్‌ ఫస్ట్‌హాఫ్‌లో ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తాయి. సినిమా స్టార్టింగ్‌ నుంచి వున్న ప్రభాస్‌ శ్రీను తన డైలాగ్స్‌తో నవ్వించడానికి ట్రై చేశాడు. హీరో లవ్‌ని యాక్సెప్ట్‌ చెయ్యాలని హీరోయిన్‌ అనుకోవడం, అతనికి ఐ లవ్‌యూ చెప్పాలని బయల్దేరడం, అదే టైమ్‌లో హీరో బ్యాడ్‌ అవ్వడం వంటి సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపిస్తుంది. సప్తగిరి క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత సినిమాలో కామెడీ పెరిగింది. సెకండాఫ్‌లో చాలా క్యారెక్టర్లు ఎంటర్‌ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వుంటుంది. అది హీరో కథకి లింక్‌ అవుతూ క్లైమాక్స్‌కి వెళ్తుంది సినిమా. ఆయా కథలకు సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌లు చూపించేటప్పుడు చాలా చోట్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. అయితే సినిమా మొత్తంలో సప్తగిరి క్యారెక్టర్‌ హైలైట్‌ అయిందని చెప్పాలి. సినిమాలో కొన్నిచోట్ల బోర్‌ ఫీల్‌ అయితే, మరికొన్నిచోట్ల విపరీతంగా నవ్వుకుంటాం. కథపరంగా, కథనం పరంగా, క్యారెక్టర్ల పరంగా కొంత కన్‌ఫ్యూజన్‌, మరికొంత బోర్‌ వున్నా కామెడీ పరంగా ఆడియన్స్‌ శాటిస్‌ఫై అయ్యేలా చేశాడు మేర్లపాక గాంధీ. ఈ సినిమా వల్ల హీరో శర్వానంద్‌కి ఒరిగేదేమీ లేకపోయినా డైరెక్టర్‌కి, కమెడియన్స్‌కి మంచి పేరు వస్తుందని మాత్రం చెప్పగలం.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close