దేవుడా, అధికారులనుంచి అమాయక నాయకులను రక్షించు!!!

ఆంధ్రాలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చాలా మంది అదేదో ఆందోళన చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని వేధిస్తున్నారని, ఆమెపై దాడి చేయించారని ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. తనమీద ఎమ్మెల్యే దాడి చేయించారని ఎమ్మార్వో విలపిస్తూ మీడియాకు చెప్పుకొన్నారు.

దీనికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా? డిగ్రీ చదివి, పోటీ పరీక్ష రాసి, కరెంట్ అఫైర్స్ పై అవగాహన ఉన్న ఎమ్మెల్యేకు కనీస కాల జ్జానం లేకపోతే ఎలా? అక్కడ ఇసుక మాఫియా దందా కొత్తగా నడుస్తోందా? బలమున్న వాడు, అధికారంలో ఉన్నవాడు దేశాన్ని, ఇసుకను, సర్వం దోచుకోవడం ఈ దేశంలో కొత్తా? వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకుని ప్రజా సంక్షేమ చక్రవర్తులుగా పోజు కొట్టేవారు, సిగ్గులేకుండా లోకానికి లెక్చర్లు ఇచ్చే వారు ఎంత మంది లేరు?

అధికార పార్టీ అంటే ఏమిటి? ఐదేళ్లు ఆ రాష్ట్రంలో ఏ దందా అయినా చేసుకోవడానికి కొనుక్కున్న లైసెన్సు. మన ఓసారి ఓట్లేశాం కాబట్టి ఐదేళ్లు నోరుమూసుకోవాలి. ఐదేళ్లు వాళ్లు ఏం చేసినా అడగకూడదు. చంద్రబాబుగారు నైతిక విలువల గురించి, నీతి నియమాల గురించి సభల్లో చాలా చెప్తారు. అవన్నీ నిజమనుకునేరు. పాపం ఆయన పరిమితులు ఆయనకు ఉండొ ఉండొచ్చు. ఏదో కారణంతో చర్యలు తీసుకోవడంలో ఆటంకాలు వచ్చి ఉండొచ్చు.

అసలు తనకు ఎలాంటి దాడులతో దందాలతో సంబంధం లేదని ఎమ్మెల్యే చింతమనేని నెత్తీనోరు బాదుకుంటున్నారు. దమ్ముంటే రుజువు చెయ్యాలని మహిళా ఎమ్మార్వోను సవాలుచేస్తున్నారు. చాలా గట్టిగా బల్లగుద్ది వాదిస్తున్నారు. తన నిర్దోషిత్వం గురించి తెలుసుకోండని ఆక్రోశిస్తున్నారు. ఆర్తనాదం చేస్తున్నారు. హాహాకారం చేస్తున్నారు. తప్పుడు పనులు చేయడం తనకు ఇంటా వంటా లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏమో, ఆయనే కరెక్టేమో.

ఒక ఎమ్మెల్యే దందా నిజామా కాదా చర్చ కాసేపు పక్కనపెడదాం. సందర్భంగా వచ్చింది కాబట్టి రాజకీయాల గురించి కొంచెం తెలివి పెంచుకుందాం. అసలు అధికారులు అధికార పార్టీ వాళ్ల జోలికి ఎందుకు వెళ్లడం? ఈరోజుల్లో ఎన్నోకొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టందే ఎమ్మెల్యే కాలేరు. పెట్టుబడి రాబట్టుకోవడం కూడా తప్పేనా? ఏ వ్యాపారికీ లేని రూల్సు ఒక్క రాజకీయ వ్యాపారికే ఎందుకు? వీళ్లు మాత్రం మనుషులు కారా? ఓటుకు ఇంత అని పక్కాగా ప్లాన్ చేసి, ఓటర్ల జాబితా ప్రకారం ఇంటింటికి కరెక్టుగా పంపిణీ చేసిన వారు, ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవద్దా? అందునా అధికార పార్టీ అన్నప్పుడు సంపాదనకు అధికారాన్ని అడ్డం పెట్టుకోవద్దా?

మొన్న పవన్ కల్యాణ్ కూడా లోక జ్జానం లేకుండా ఏవేవో ట్వీట్లు చేసేశారు. ఎంపీలు వ్యాపారాలు కాదు ప్రజాసేవ చెయ్యాలని. ఏం వ్యాపారం మాత్రం ప్రజాసేవ కాదా? ఎంపీ గారి బస్సుల్లో రోజూ లక్షల మంది సొంతూళ్ళకు ప్రయాణాలు చెయ్యడం ప్రజాసేవ కాదా? ఆర్టీసీది మాత్రమే ప్రజా సేవా? మరో ఎంపీ బ్యాటరీలు తయారు చేస్తే ఎంతో మందికి వెలుగులు వస్తున్నాయి. అది ప్రజా సేవ కాదా. ఒకరు పత్తినీ మరొకరు పొగాకునూ ఎగుమతి చేస్తే అది ఉపయోగించిన వారు హాయిగా మజా చేస్తుంటే అది ప్రజా సేవ కాదా? ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల మీద పడటం ఫ్యాషనై పోయింది.

పాపం నాయకులు. ఓట్లనే కొంటారా, పెట్టుబడినే రాబట్టుకుంటారా? కార్యకర్తలనే కాపాడుకుంటారా? రౌడీలనే పోషించుకుంటారా? ఎన్ని కష్టాలో. కాబట్టి వీరికి ప్రభుత్వాలు స్పెషల్ అలవెన్స్ ఇవ్వడం మంచిది. అప్పుడు ఇంకా ఇంకా దందాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చంద్రబాబు గారికి జపాన్ వారో సింగపూర్ వారో ఈ సలహా ఇచ్చే ఉంటారా? ఏమో!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close