రష్యాలో నవాజ్ షరీఫ్‌తో మోడీ చర్చలు

రష్యా వేదికగా భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రుల మంతనాలు ముగిశాయి. ఇద్దరూ గంటసేపు చర్చించుకున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం, మత్స్యకారుల విడుదల వంటి అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. టెర్రరిజంపై నవాజ్ షరీఫ్ పాత పాటే వినిపించారు. కసబ్ గ్యాంగ్ ముంబై ముట్టడితో పాకిస్తాన్ లో ఎవరికీ సంబంధం లేదని చెప్పేశారు. లఖ్వీ గ్యాంగ్ కు సంబంధం ఉందని నరేంద్ర మోడీ చెప్పినా షరీఫ్ మాత్రం ఊహూ అన్నట్టు సమాచారం. లఖ్వీ విడుదలకు పరోక్షంగా ఎందుకు సహకరించారని మోడీ షరీఫ్ ను అడిగారో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ అడిగినా అడ్డంగా ఖండించడం షరీఫ్ కు కొత్త కాదు.

వృథా అని తెలిసీ ప్రయాస పడటం వివేకం అనిపించుకోవడని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. పాకిస్తాన్ ఏ నిజాన్నీ ఒప్పుకోదని చిన్న పిల్లలకు కూడా తెలుసు. అలాంటి దేశానికి టెర్రరిజం ఆధారాలు చూపించడం, నిజం ఒప్పుకునేలా చేయడానికి ప్రయత్నించడం అనవసరం. ఇంతకీ మోడీ, షరీఫ్ సమావేశం ఏం సాధించింది?

ముంబై ముట్టడి కేసులో పాకిస్తాన్ టెలిఫోన్ సంభాషణల టేపులు భారత్ పంపిస్తుంది. సరే పంపండని షరీఫ్ పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. పాక్ లో జరిగే సార్క్ సమావేశానికి మోడీ హాజరవుతారు. పాక్ అరెస్టు చేసిన కొందరు మత్స్యకారులను విడుదల చేస్తారు. అలాగే వాణిజ్యపరమైన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

మనిషికో మాట, గొడ్డుకోదెబ్బ అన్నారు. పాకిస్తాన్ కు ఇది సరిగ్గా వర్తిస్తుంది. మన్మోహన్ సింగ్ జమానాలో సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం ఆడింది ఆట అనే విధంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్తారని దేశ ప్రజలు ఆశించారు. కానీ ఏడాదిగా అలాంటిదేమీ కనిపించడం లేదు. అయితే, సరిహద్దుల్లో మాత్రం పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగడం లేదు కానీ ఇవాళ ఇద్దరు ప్రధానులు భేటీ అవుతున్నారని తెలిసీ, గత 24 గంటల్లో పాక్ సైన్యం రెండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శుక్రవారం ఉదయం పాక్ కాల్పులో ఒక బిఎస్ఎఫ్ జవాన్ అమరుడయ్యాడు.

ఇది జరిగిన వెంటనే ఏకధాటిగా షెల్లింగ్ చేయాలని ఢిల్లీ నుంచి సైన్యానికి సందేశం వెళ్లి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండి ఉండేది. మోడీతో నవాజ్ షరీఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చే సమయానికి మన సైన్యం పాక్ రేంజర్లపై ఫిరంగుల వర్షం కురిపిస్తోందనే కబురు వచ్చి ఉంటే, షరీఫ్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని చర్చలు జరిపేవారు. ఒకప్పటిలా ఇష్టారాజ్యంగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుందనే భయం పాకిస్తాను కలిగిస్తేనే కాస్లయినా పొగరు తగ్గుతుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. బీజేపీ వారికి బాధ కలిగినా, ఒక్క విషయం మాత్రం వాస్తవం.

ప్రధాన మంత్రి మారారు గానీ పరిస్థితి ఏమీ మారలేదు. ఈంట్ గా జవాబ్ పత్థర్ సే దేతే (ఇటుకతో కొడితే రాయితో జవాబిస్తాం) అని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మీడియా ముఖంగా ఇటీవల భారత్ ను బెదిరించనప్పుడు, మనం సరిహద్దుల్లో చిన్న శాంపిల్ అయినా చూపించలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘన అనేది మనం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం జరగలేదు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశం దర్జాగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే, మనం ఎంతసేపూ మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనమే ముందు దాడి చేస్తేనే కదా, పాకిస్తాన్ కు బుద్ధి వచ్చేది. మోడీ, షరీఫ్ భేటీలో మనం సాధించింది ఏమీ లేదు. షరీఫ్ మాత్రం పాత పాటే వల్లించి, అనే నిజమేమో అని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించడానికి మరోసారి ప్రయత్నించారు. చాణక్యం ప్రదర్శించారు. చాణక్యుడు పుట్టిన దేశమై ఉండి కూడా, మన ప్రధాని ఆపాటి చాకచక్యం కూడా ప్రదర్శించలేదని సంకేతాలు అందుతున్నాయి. అదే దురదృష్టకరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలినేనిది బ్లాక్‌మెయిలింగే ?

జగన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కర్ని వదులుకున్నా అది జగన్ రెడ్డికి నైతిక దెబ్బే అవుతుంది. ముఖ్యంగా బాలినేని లాంటి...

జానీ మాస్ట‌ర్ కేస్‌: కొరియోగ్రాఫ‌ర్ల అత్య‌వ‌స‌ర మీటింగ్

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై హ‌త్యాచార కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఓ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నార్సింగ్ పోలీసులు జానీ మాస్ట‌ర్ పై విచార‌ణ చేప‌ట్టారు. అయితే జానీ...

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం – రేవంత్ వార్నింగ్

ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందంటే కారణం మజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనేనని చెప్పుకొచ్చారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని...

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close