నిను వీడని నీడను నేనే అంటున్న బాలీవుడ్‌ స్టార్‌హీరో!

ఆయన నిన్నటితరం బాలీవుడ్‌ స్టార్‌ హీరో! ఉత్తరాదిలో మాత్రమే కాదు.. దక్షిణాదిలో కూడా ఒక తరం మొత్తం యువతరాన్ని ఉర్రూతలూపిన హీరో! అలాంటి హీరో ఆతర్వాత రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. భారతీయ జనతా పార్టీలో ఎంతో ఉన్నతస్థానాలకు ఎదిగారు. అయితే తాజా పార్టీ సమీకరణాల్లో లూప్‌లైన్లో ఉన్నారు. ఆయన మరెవ్వరో కాదు.. బాలీవుడ్‌ వెటరన్‌స్టార్‌ శతృఘ్న సిన్హా. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను బహిరంగంగా ఎండగడుతూ.. ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పదంగా వార్తల్లో కనిపిస్తూ ఉండే శతృఘ్న సిన్హా.. అయితే ఆయన తాజాగా ఒక క్లారిటీ ఇస్తున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ అంటున్నట్లుగా భాజపాను ఇండైరక్టుగా హెచ్చరిస్తున్నారు.

భాజపాలో మోడీ హవా మొదలైన తర్వాత.. చాలా మంది సీనియర్లు అనివార్యంగా లూప్‌లైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి లాంటి కొమ్ములు తిరిగిన వారికే ఇది తప్పలేదు. ఆ జాబితాలోనే శతృఘ్న సిన్హా కూడా తెరవెనుకకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆయన ఇతర పెద్దల్లా మోడీ మీద మౌనం వహించలేదు. ఎడాపెడా చెండాడడం ప్రారంభించారు. ప్రత్యేకించి బీహార్‌ ఎన్నికలలో తనను వాడుకోకపోవడంపై నిరసించారు. అక్కడ ప్రత్యేకంగా మోడీ ప్రత్యర్థి నితీశ్‌ పాలన బాగున్నదని కితాబులు ఇస్తూ భాజపాకు చికాకులు సృష్టించారు.

తాజాగా ఆయన హైదరాబాదులో తన జీవితచరిత్ర ‘ఎనీథింగ్‌ బట్‌ ఖామోష్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ద్వారా ఆయన మరో క్లారిటీ కూడా ఇచ్చారు. భాజపా తన మొదటి చివరి పార్టీ అని శతృఘ్న సిన్హా ఆ పుస్తకంలో పేర్కొనడం విశేషం. అంటే భాజపాలోనే ఉంటూ… ఆ పార్టీని నిత్యం తిట్టిపోస్తూ ఉండే ఈ హీరో, మోడీ సర్కారు నిర్ణయాలను నిత్యం తూర్పారబట్టడంలో పేరుమోసిన హీరో.. ఈ మాటలు చెప్పడం.. ఏదో పార్టీని హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోంది దూ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close