ఈమధ్య కమిడియన్ సత్య హవా బాగా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్ కి తానే స్టార్ కమిడియన్. మరోవైపు హీరోగానూ ప్రయత్నాలు చేస్తున్నాడు. సత్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘మత్తువదలరా’ ఫేమ్ నితిశ్ రానా దర్శకుడు. ఈ రోజు గ్లింప్స్ విడుదల చేశారు. ఎప్పటిలానే సత్య తనదైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో అలరించాడు. ‘విశ్వదాభిరామా.. ఇంతకీ నేనెవడ్రా మామా..’ అంటూ ఫస్ట్ డైలాగ్ తోనే నవ్వించేశాడు.
‘నువ్వు హీరోవా.. టైర్ వన్నా, టూవా, త్రీనా’ అని వెన్నెల కిషోర్ అడిగితే..
సత్య స్టైల్ గా ‘జనరల్ కంపార్ట్మెంట్’ అనడం బాగా కుదిరింది.
ఇది పూర్తిగా ఫ్లైట్ లో సాగే కథ. గ్లింప్స్ కూడా అదే సూచిస్తోంది. సత్యతో యాక్షన్ కూడా చేయించారు. ఈ సినిమాకు సంబంధించి కొన్నిప్రమోషనల్ కంటెంట్స్ వరుసగా విడుదల చేస్తున్నారు. సత్య తనపై తాను జోకులు వేసుకొంటూ.. రూపొందిస్తున్న ఈ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ గ్లింప్స్ కూడా ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తీసుకొచ్చేలా వుంది. ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలో నితీష్ రానా ఓరకమైన కలర్ పేట్రన్ అనుసరించాడు. ఈ సినిమా కూడా అదే పంథాలో సాగినట్టు కనిపిస్తోంది. ఈమధ్యే సినిమా మొదలైంది. అప్పుడే గ్లింప్స్ వరకూ వచ్చేశారంటే షూటింగ్ చక చక సాగుతున్నట్టే అనుకోవాలి.
