పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరో నాలుగు వారాల గడువు లభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు ముగిసిపోయింది. అయితే విచారణ పూర్తి కాలేదని మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కేటీఆర్ మరో పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పీకర్ పై అసహనం వ్యక్తం చేశారు. అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని ఘాటుగా ప్రశ్నించింది. స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని తె .. ఎమ్మెల్యేల అనర్హతాప ై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సీజేఐ సూచించారు. 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు.
అంటే మరో నాలుగు వారాల సమయం స్పీకర్ కు లభించిందన్నమాట. ఆ లోపు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెలలను కూడా చేర్చుకుని విలీనం పూర్తయిందని చెబుతారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల వ్యూహాలు, అమలును బట్టి ఉంటుంది. కానీ నిర్ణయం మాత్రం తీసుకోాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కడియం, దాన ంతప్ప మిగతా వారందరూ తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. వారందరూ పార్టీ మారలేదని తేల్చినా.. దానం, కడియం విషయంలో మాత్రం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


