తన మరణశిక్షని రద్దు చేయాలంటూ యాకుబ్ మీమన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు అతనికి మరణశిక్ష విధించడం సరయినదేనని, దానిపై దాఖలయిన క్యూరేటివ్ పిటిషన్ పై పునర్విచారణ అవసరం లేదని తీర్పు చెప్పింది. సుప్రీం ధర్మాసనం ఈరోజు ఇచ్చిన తీర్పుతో యాకుబ్ మీమన్ కి అంతిమ క్షణాలు దగ్గరపడినట్లే భావించవచ్చును. అతను ఈరోజు రాష్ట్రపతికి మళ్ళీ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొన్నప్పటికీ దానిని ఆయన తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. అదేవిధంగా ఇంతకు ముందు అతను మహారాష్ట్ర గవర్నర్ కి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని ఆయన ఇదివరకే తిరస్కరించినట్లు వార్తలు వచ్చేయి. రాష్ట్రపతి కూడా అతని క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించినట్లయితే రేపు ఉదయం ఏడు గంటలకు నాగపూర్ జైల్లో యాకుబ్ మీమన్ని ఉరి తీస్తారు.