అదాని గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్‌బెర్గ్ చేసిన మ్యానిప్యులేషన్ ఆరోపణల్లో నిజం లేదని సెబి తేల్చింది. సుదీర్ఘ కాలం పరిశీలన జరిపి తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పటికే హిండెన్ బెర్గ్ కూడా దుకాణం ఎత్తేసింది. అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ..స్టాక్ మార్కెట్లలో అక్రమాలు చేసే కంపెనీ గురించి పరిశోధన చేసి బయటెడుతూ ఉంటారు. హిండెన్ బర్గ్.. అదాని గ్రూప్ కంపెనీల లావాదేవీలు, పెట్టుబడులపై చాలా అనుమానాలు ఉన్నాయని ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మార్కెట్ లో బాగా నష్టపోయాయి. తరవాత కోలుకున్నాయి.
జనవరి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అదాని గ్రూప్‌పై స్టాక్ మానిప్యులేషన్, షెల్ కంపెనీలు, గ్రూపు కంపెనీల మధ్య లావాదేవీలను దాచి ఉంచడం వంటి ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేసింది. ఇప్పటికి దర్యాప్తు పూర్తి చేసి.. అదానీ గ్రూపు ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని తేల్చింది. అదాని గ్రూప్ ఎప్పటి నుంచో తమ చర్యలు భారతీయ చట్టాలు మరియు అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉన్నాయని చెబుతూ వస్తోంది. సెబీ దర్యాప్తు ఈ మ్యాటర్‌ను క్లోజ్ చేసినట్లయింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈ ఏడాది జనవరిలో మూసేశారు. 2017లో అండర్సన్ అనే వ్యక్తి ప్రారంభించిన ఈ సంస్థ అదాని గ్రూప్ , నికోలా, బ్లాక్ ఇంక్ వంటి కంపెనీలపై ఫ్రాడ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూపునకు సంబంధించి SEBI షో-కాజ్ నోటీస్, లీగల్ ప్రెషర్, రెగ్యులేటరీ సమస్యలు చుట్టు ముట్టడంతో అండర్సన్ కంపెనీని మూసివేశారు.