టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసుల వెనుక “టచ్చింగ్” సీక్రెట్ ఉందా ..?

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని.. నాలుగు రోజుల కిందట .. వార్తలు వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. ఇవి అంత ఆషామాషీగా రాలేదని మాత్రం.. టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ప్రారంభమయింది. ఎందుకంటే.. దేశంలో.. తెలంగాణతో పాటు.. మరో నాలుగు రాష్ట్రాల్లో.. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా.. కొన్ని వందల మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇతర రాజకీయ పదవులు అనుభవించిన వారే. వారి గత అఫిడవిట్లు.. కచ్చితంగా…ఐటీ వద్ద ఉంటాయి. కొత్త అఫిడవిట్లు సేకరించే ఉంటారు. కానీ.. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎందుకు నోటీసులు వచ్చాయనేది.. కీలకంగా మారింది. చివరకు ముఖ్యమంత్రికి కూడా వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో కానీ.. ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చాయన్న విషయం రూఢీ అయిపోయింది.

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు… నిజంగానే… మొన్నటి ఎన్నికల్లో ఆస్తులు ఎక్కువగా చూపించారు. ఈ మధ్య కాలంలో.. ఆ ఎమ్మెల్యేల సంపాదన ఏమిటి..? ఆ సంపాదన వివరాలు.. ఐటీ రిటర్నుల్లో పొందు పరిచారా లేదా.. అన్నది చూసుకునేంత తీరిక వారికి ఉండదు. హడావుడిగా నామినేషన్ దాఖలు చేసే క్రమంలో.. ఏవో ఉజ్జాయింపు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు సమస్యగా మారిందన్న అభిప్రాయం… చాలా మందిలో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మల‌్యేల్లో చాలా మంది.. సొంత వ్యాపారాలు లేని వాళ్లే. రాజకీయం మీద బతికేస్తున్న వాళ్లే. వాళ్లు ఆదాయం చూపించడం అంత తేలిక కాదు. అందుకే.. చాలా మంది.. ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల వద్ద పరుగులు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఇప్పుడే.. ఈ నోటీసులు ఎందుకు వస్తున్నాయన్నది.. చాలా మందికి అర్థం కావడం లేదు. కీడెంచి మేలెంచడం ముఖ్యమన్నట్లుగా.. కొంత మంది టీఆర్ఎస్ నేతలు.. మోడీ చేస్తున్న టచ్చింగ్ కామెంట్లను గుర్తు చేసుకున్నారు. ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాల కోసం.. ఈ నోటీసులను ముందస్తుగా ప్రయోగించారా.. అన్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్‌లో ఇప్పుడు.. ఓ రకమైన వాతావరణం ఉంది. మే 23వ తేదీ తర్వాత ఎన్నికల ఫలితాలను బట్టి.. కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా.. అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. దీనిపై త్వరలోనే తెర వెనుక రాజకీయాలు ఏమైనా ఉంటే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

ప్రజల కామన్‌సెన్స్‌కు పరీక్ష పెడుతున్న జగన్ !

వివేకా హత్య కేసు దగ్గర నుంచి తన పరిపాలనా ఘనతల వరకూ ... ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ చెబుతున్న విషయాలు.. చెప్పుకున్నంటున్న అంశాలు.. క్రెడిట్ తీసుకుంటున్న వ్యవహారాలు చూస్తే.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close