శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయ్యింది. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలు. ఈ సినిమా రిలీజ్ టైం లాక్ చేశారు. ఈ సంక్రాంతికి జనవరి 14న సినిమా విడుదల కానుంది. ప్రీమియర్ షో సమయం – సాయంత్రం 5:49. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంది
శర్వానంద్ నటించిన శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలు జనవరి 14న విడుదలయ్యాయి. ఆరకంగా ఈ సినిమాకి పాజిటివ్ సెంటిమెంట్ వుంది. ఈ పండుగకి చాలా పోటీ వుంది. పండగ చివర్లో సినిమాకు కాస్త పోటీ తగ్గుతుంది, సెలవలు కూడా మిగిలే ఉంటాయనే ఆలోచనలో వుంది టీమ్. అందుకే సాయంత్రం ఆటలతో సినిమా మొదలుపెడుతున్నారు.
రామ్ అబ్బరాజు మంచి ఫ్యామిలీ టచ్ వున్న సినిమాలు తీసే దర్శకుడు. సామజవరగమన చిత్రానికి పని చేసిన నందు భాను ఈ టీమ్ లోనూ ఉన్నారు. ఇది పక్కగా పండగకి రావాల్సిన సినిమా అని దర్శక నిర్మాతల నమ్మకం. అందుకే ఇంతపోటీలోనూ కూడా వదులుతున్నారు.
