‘మ‌హ‌ర్షి’ టైపు క‌థ‌లో.. శ‌ర్వానంద్‌?

తెలుగు చిత్ర‌సీమ‌కు ఓ పాడు బుద్ది ఉంది. ఓ సినిమా హిట్ట‌యితే – దానికి అటూ ఇటుగా క‌థ‌లు అల్లుకుని సినిమాలు తీసేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ కి ‘మ‌హ‌ర్షి’ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఈ సినిమాలోలా ఓ బ‌ల‌మైన సోష‌ల్ ఎలిమెంట్‌కి, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించి క‌థ‌లు వండేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ కూడా అదే దారిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో శ‌ర్వా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం కానున్నాడు. ఓ మిలియ‌నీర్ వ్య‌వ‌సాయ‌దారుడుగా మార‌డ‌మే ఈ సినిమా క‌థాంశం అని తెలుస్తోంది. థీమ్ ఒకేలా ఉన్నా – స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్ కాస్త విభిన్నంగా ఉంటే, విజ‌యం సాధించొచ్చు. కాక‌పోతే ఏమాత్రం అటూ ఇటూ అయినా… మ‌హ‌ర్షిని చూసి వాత‌లు పెట్టుకున్నార‌న్న అప‌నింద మాత్రం మోయాల్సివ‌స్తుంది. ఇది వ‌ర‌కు శ‌ర్వాపై ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవ‌ర్ ఉండేద‌ని టాక్‌. త‌న ప‌డి ప‌డి లేచే మ‌న‌సులో కొన్ని షాట్లు అర్జున్ రెడ్డి హ్యాంగోవ‌ర్ లో తీసిన‌వే అని… అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఏమైంది? ‘ప‌డి ప‌డి లేచే మ‌న‌సు’తో శ‌ర్వా కెరీర్ ఇంకాస్త కింద‌కు ప‌డింది. మ‌రి ఈసారి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close