విజయ్ దేవ‌ర‌కొండ స‌రికొత్త నిర్ణ‌యం

విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఓ స్టార్‌. త‌న చుట్టూ తిరుగుతున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల సంఖ్య రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. ఈ డిమాండ్‌నీ, క్రేజ్‌నీ విజ‌య్ కూడా బాగానే వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద బ్యాన‌ర్‌ల‌తో సినిమాలు చేస్తున్నాడు. ఆయా చిత్రాలు విడుద‌ల‌కు ముందే లాభాల్ని తెచ్చుకుంటున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించే `కింగ్ ఆఫ్ ది హిల్స్‌` అనే ఓ సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ బ్యాన‌ర్‌లో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.

ఇప్పుడు మాత్రం ప్లాన్ మార్చాడు దేవ‌ర‌కొండ‌. ఇక‌పై త‌న సొంత బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేయ‌డానికి ఫిక్స‌య్యాడు. అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు కూడా వేస్తున్నాడు. త‌న చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో చాలా మ‌ట్టుకు `గీత గోవిందం` ముందు తీసుకున్న అడ్వాన్సులే. పెళ్లి చూపులు స‌మ‌యంలో తీసుకున్న అడ్వాన్సుల‌కూ ఇప్పుడు సినిమాలు చేయాల్సివ‌స్తుంది. త‌న సినిమాల‌న్నీ పూర్త‌య్యేస‌రికి 2020 అవుతుంది. ఆ త‌ర‌వాత‌… సొంత బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేయ‌బోతున్నాడ‌ట‌. పెద్ద సంస్థ‌లు వ‌స్తే… త‌న పారితోషికాన్ని మిన‌హాయించుకుని, వాటా దారుడిగా చేయ‌బోతున్నాడ‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు కూడా `దొర‌సాని` సినిమాతో హీరో అవుతున్నాడు. ఆ సినిమా హిట్ట‌యితే… ఇక `కింగ్ ఆప్ ది హిల్స్‌` బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి విజ‌య్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే… ఇప్పుడున్న ప్రాజెక్టుల‌ను వేగ‌వంతంగా పూర్తిచేయ‌మ‌ని ద‌ర్శ‌కుల్ని, నిర్మాత‌ల్నీ తొంద‌ర పెడుతున్నాడ‌ట‌. అందుకే విజ‌య్ సినిమాల‌న్నీ ఇప్పుడు వ‌రుస‌గా ప‌ట్టాలెక్క‌బోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com