కేజ్రీపై షూ విసిరారు : జనంలో ఇంత కోపముందా?

సామాన్యుడి ఆగ్రహం ఎలా ఉంటుందో.. ‘సామాన్యుడి పార్టీ’ అధినేతకు కూడా తప్పలేదు. ఆంఆద్మీ పార్టీ అధినేతగా ఢిల్లీ సీఎం సింహాసనం అధిష్టించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు చాలా చేదు అనుభవం శనివారం నాడు ఎదురైంది. ఢిల్లీ నగరంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి రోజు మార్చిరోజు సరి, బేసి కార్ల వాడకాన్ని నిబంధనగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించడానికి కేజ్రీవాల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆయన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వెనుక నుంచి ఒక వ్యక్తి కేజ్రీవాల్‌ మీదకు షూ విసిరి తీవ్రస్థాయిలో దుర్భాషలాడాడు.
దీంతో ఒక్కసారిగా అంతా గందరగోళం అయిపోయింది. ప్రెస్‌మీట్‌ స్తంభించిపోయింది. మీడియా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అంతా ఒక్కసారిగా షూ విసిరిన వ్యక్తిని చిత్రీకరించడానికి ఎగబడ్డారు. అంతా రసాభాస అయిపోయింది. షూ తన మీదికి విసరడంతో.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనంగా.. విసిరిన వ్యక్తికేసి చూస్తూ ఉండిపోయారు.
ఈలోగా సిబ్బంది, ముఖ్యమంత్రి భద్రతాధికారులు అంతా కలిసి.. షూ విసిరి, దుర్భాషలాడుతూ ఉన్న వ్యక్తికి దేహశుద్ధి చేసి.. సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆయనకు ఎందుకు అంత ఆగ్రహం ఉంది అనే వివరాలు ఏవీ బయటకు రాలేదు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు.. ఇతడిని ఆంఆద్మీ పార్టీ కార్యకర్త అని గుర్తించారు. తమ మీద కేజ్రీవాల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ చేస్తున్నాడంటూ అతను ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి. సామాన్యుల ప్రతినిధిగా సీఎం పోస్టులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌పై కూడా జనంలో ఇంత స్థాయిలో ఆగ్రహం ఉన్నదా అని పలువురు విస్తుపోవడం కనిపించింది.
ప్రెస్‌మీట్‌లు వంటి సందర్భాల్లో నాయకుల మీద ఎవరో ఒకరు చెప్పులు విసరడం అనేది ఇటీవలి కాలంలో చాలా తరచుగా జరుగుతోంది. ఆ మధ్య విదేశాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. తర్వాత తెలుగురాష్ట్రాల్లో కూడా జరిగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close