బాల‌య్య వంద‌లో… కాజ‌ల్‌??

నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఉగాది రోజున వెలువ‌డింది. అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది కాబ‌ట్టి క్రిష్ అండ్ కో.. ఇప్పుడు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్‌ల వేట‌లో ప‌డింది. క‌థానాయిక‌గా న‌య‌న‌తార పేరు దాదాపుగా ఖాయ‌మైపోయింది. ఆమె కానిప‌క్షంలో మ‌రో ఛాయిస్ కూడా రెడీగా ఉంచుకోవాల‌ని క్రిష్ ఉద్దేశం. అందుకే.. ఇప్పుడు మ‌రో క‌థానాయిక‌ని రంగంలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌నే.. కాజ‌ల్.

కాజ‌ల్ ఇప్ప‌టి వ‌ర‌కూ అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జ‌త క‌ట్టింది. అయితే.. బాల‌కృష్ణ‌తో మాత్రం జోడీ కుద‌ర్లేదు. పైగా.. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌కు కాజ‌ల్ కూడా స‌రైన ఎంపికే… అన్న‌ది క్రిష్ న‌మ్మ‌కం. న‌య‌న‌తార పారితోషికం రెండు కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేస్తోంది. కాజ‌ల్ కి అయితే అందులో ఇస్తే స‌రిపోతుంది. పైగా బాల‌య్య – కాజ‌ల్‌ల జంట ఇంకా కొత్త‌గా క‌నిపించే అవ‌కాశం ఉంది. అందుకే.. న‌య‌న‌తారతో పాటు కాజ‌ల్ నీ చిత్ర‌బృందం సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌య‌మై వారం ప‌దిరోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close