బాలూ… నీకు ఆ హ‌క్కు లేదు: సిరివెన్నెల ఆత్మీయ మేల్కొలుపు

దిగ్గ‌జ గాయకుడు బాలు సుబ్ర‌హ్మ‌ణ్యం ఆసుప‌త్రి పాల‌య్యార‌న్న విష‌యం.. సంగీత ప్ర‌పంచాన్ని కుదిపివేసింది. బాలుకి ఏమైంది? ఎలా వుంది? అనే ఆవేద‌నే అంత‌టా. పాట సైతం నిశ్శ‌బ్దంగా స్థంభించి పోయింది. స‌రిగ‌మ‌లు గ‌మ‌కాలు త‌ప్పి.. అల్లాడాయి. కోట్లాడి గుండెలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. బాలు మేల్కొనాల‌ని, మ‌ళ్లీ మైకు అందుకోవాల‌ని, తెలుగు పాట‌కు మ‌రికొన్ని అందాలు అద్దాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి. బాలుని ప్రేమ‌గా అన్న‌య్యా..అని పిలుచుకునే సీతారాముడు అన‌బ‌డే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి.. బాలు కోసం త‌న ప్రేమ‌నంతా రంగ‌రించి ఇలా అక్ష‌రాలతో మేల్కొలిపే ప్ర‌య‌త్నం చేశారు.

“ఒక్క ప్రాణం కాస్త న‌ల‌త‌గా ఉండి
ఆయాస‌ప‌డుతోంటే…
ఒక‌టి కాదు, వేలూ ల‌క్ష‌లు కాదు,
కోట్లాది ప్రాణాలు క‌ల‌త‌ పడి కొట్టిమిట్టాడుతున్నాయి

ఒక్క శ్వాస‌లో స‌రిగ‌మ‌లు
అప‌శ్రుతిని స‌రిచేసుకుంటుంటే
నా దేశ‌పు ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది

కొన్ని త‌రాలుగా గాలి,
బాలు పాట‌గా, మాట‌గా మారి
ఉనికిని చాటుకుంటూ వీస్తోంది… విహ‌రిస్తోంది
ఇప్పుడెందుకో ఓ చిన్న వెంటిలేట‌ర్ ఇరుకుల్లో
చిక్కుకుని విల‌విలలాడుతోంది

కొన్నాళ్లుగా ఆకాశ‌పు మౌనం
కంటికి మింటికి ఏక ధార‌గా రోధించి
నిన్న‌టి నుంచే వెచ్చ‌ని సూర్య కిర‌ణాల‌తో
చెక్కిళ్లు తుడుచుకుని కాస్త తెరిపిన ప‌డుతోంది

అన్న‌య్యా… ఇక చాలు

ఇన్నిరోజులుగా మౌనంగా విశ్రాంతి తీసుకునే
హ‌క్కూ.. అక్క‌ర నీకు లేవు
తొంద‌ర‌గా కోలుకో

కొత్త ప‌ల్ల‌వితో ప‌కృతిని ప్రాణ‌గీతిక‌గా చిగురించ‌ని
మా అంద‌రి గొంతులో కొట్టుకుంటున్న గుండెల స‌డిని స‌రిచేయి

చినుకు చెమ్మ‌లో మ‌స‌క‌బారిపోయిన దిశ‌ల‌కు
నీ న‌వ్వుల వెలుగుతో దారి చూపాలి రా..

ఇది నా ప్రార్థ‌న‌

శివుడి ఆన కాలేదు
నిన్ను చీమైనా కుట్ట‌దు
ఆ శివుని మీద ఆన‌

నీ త‌మ్ముడు
– సీతారాముడు

ఈ వీడియోని ట్విట్ట‌ర్‌లో ఉంచారు సీతారామ‌శాస్త్రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close