పది రోజుల్లో లక్ష.. ఏపీలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సగటున రోజుకు పదివేల చొప్పున నమోదవుతున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన రెండు లక్షల మార్క్‌ను దాటిన పాజిటివ్ కేసులు పద్దెనిమిదో తేదీకి మూడు లక్షలు దాటేశాయి. ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. 88 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 85,130 ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రోజువారీ కేసుల నమోదులో..మహారాష్ట్ర కన్నా.. ఏపీనే ముందు ఉంది. మరణాలు కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికం చోటు చేసుకుంటున్నాయి.

కరోనా కేసుల డబ్లింగ్ రేటులో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందు ఉంది. పది రోజుల్లోనే..కేసులు రెట్టింపు అవుతున్న రాష్ట్ర మరొకటి లేదు. టెస్టుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ..పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం అధికారవర్గాలనుసైతం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న యాభై ఆరు వేల టెస్టులు చేసినా..దాదాపుగా పది వేల కేసులు నమోదయ్యాయి. అంటే.. పాజిటివ్ రేటు పదిహేను శాతానికంటే ఎక్కువగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది.

కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో వైద్యం అందించడం కూడా భారంగా మారుతోంది. డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటున్నప్పటికీ.. లక్షణాలు లేని వారిని ఐదు రోజుల్లో ఇంటికి పంపించేస్తున్నారు. వారందరని డిశ్చార్జ్ జాబితాలో వేస్తున్నారు. అలాంటి వారు తర్వాత బయట యథేచ్చగా తిరుగుతూ…కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు పెరగడానికి కూడా.. ఈ అసంప్టమాటిక్ కేసులే ఎక్కువ కారణం అని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close