రాహుల్ ని న‌మ్ముకున్న యువ నాయ‌క‌త్వం మాటేంటి..?

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను మ‌రోసారి సోనియా గాంధీకే నాయ‌కులు అప్ప‌గించారు. రాహుల్ గాంధీ రాజీనామా త‌రువాత అధ్య‌క్షుడుని ఎన్నుకునే క్ర‌మంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. దీంతో క‌ర్ణాట‌క‌లో అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇలాంటి న‌ష్టాలు ఇంకా పెర‌గ‌కుండా ఉండాలంటే… తాత్కాలికంగా సోనియాకి బాధ్య‌త‌లు అప్ప‌గించక‌ త‌ప్ప‌దు అనే ప‌రిస్థితి వ‌చ్చింది. కొంత‌మంది వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల‌ను నియ‌మించి, సీనియ‌ర్లు వెన‌క ఉంటూ కొన్నాళ్ల‌పాటు పార్టీని న‌డిపిస్తార‌ని స‌మాచారం. అయితే, రాహుల్ గాంధీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌కు దూరం కావ‌డంతో… పార్టీలో యువ నాయ‌క‌త్వం మాటేంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయం అవుతోంది.

ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ ఏం చేయ‌బోతున్నారు అనేది కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న సైనికుడిగా పోరాడ‌తార‌ని ఇత‌ర నేత‌లు చెబుతున్నా… ఆయ‌న్నే న‌మ్ముకుని వ‌చ్చిన యువ నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ఇంకో చ‌ర్చ‌నీయాంశం. జ్యోతిరాద్య సింధియా, స‌చిన్ పైలెట్, మిలింద్ దేవ్ రా… ఇలా కొంత‌మంది యువ నాయ‌కులు ఒక‌ప్పుడు రాహుల్ గాంధీ టీమ్ గా ఉండేవారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ రాజీనామా చేయ‌డంతో… వీళ్లు కూడా అదే బాట‌లో పార్టీ ప‌దవుల‌కు రాజీనామా చేశారు. అంద‌రూ క‌లిసి మ‌రోసారి రాహుల్ గాంధీని ఒప్పిస్తార‌నే అభిప్రాయమే ఉండేది. అయితే, ఆయ‌న స‌సేమిరా అనేయడంతో ఇప్పుడు ఈ యువ నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది వేచి చూడాలి. రాహుల్ కి బ‌దులుగా మ‌ళ్లీ గాంధీ కుటుంబం చేతిలోనే పార్టీ ప‌గ్గాలు ఉండ‌టం వీరికి ఇష్ట‌మా కాదా అనేదీ ప్ర‌శ్నే? రాహుల్ స్ఫూర్తితో ప‌ద‌వులు వ‌దులుకున్న యువ నాయ‌కుల‌కి మ‌ళ్లీ ఆ ప‌ద‌వులు ఇస్తారా, కొత్త‌వారిని భ‌ర్తీ చేస్తారా అనేదీ చూడాలి.

క‌ర్ణాట‌కలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత‌మంది నాయ‌కుల కాంగ్రెస్ ని వ‌దిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయ‌కుల్లో యువ నాయ‌కులు చాలామంది ఉన్నారు. వెళ్లిపోయినవారిని మ‌ళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చొర‌వ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. రాహుల్ అధ్య‌క్ష ప‌ద‌వికి దూరం కావడంతో పార్టీలో ఆయ‌న్నే న‌మ్ముకున్న యువ నాయ‌క‌త్వం ఇప్పుడు నీర‌సించే అవ‌కాశం క‌నిస్తోంది. త‌న ప‌నేదో తాను చేసుకుంటాన‌ని రాహుల్ కూర్చుంటే యువ నాయ‌క‌త్వమంతా మ‌రింత డీలా ప‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close