సమీక్ష: కంటెంట్ లేని కామెడీ ‘సౌఖ్యం’

యాక్షన్ హీరోగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ లౌఖ్యంతో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా హిట్ మజాని రుచి చూశాడు. ఆ తర్వాత జిల్ అంటూ స్టైలిష్ సినిమా తీసి పర్వాలేదనిపించినా మరోసారి తనకు లౌఖ్యం హిట్ ఇచ్చిన కామెడీ జానర్ లోనే తెరకెక్కిన సౌఖ్యంతో మనముందుకు వచ్చాడు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సౌఖ్యం సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిందా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూసిన గోపీచంద్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా లేదా అన్నది ఈనాటి మన సమీక్షలో చూద్దాం..!

కథ:

సరదాగా తిరిగే కుర్రాడు శ్రీనివాస్ (గోపీచంద్) అందరు ముద్దుగా శ్రీను అని పిస్తుంటారు. హైదరాబాద్ లో ఉంటున్న శ్రీను సరదాగా తిరుపతి వెళ్తుంటే ట్రైన్ లో శైలజ (రెజినా) పరిచయమవుతుంది. శైలజని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను. ఆమెని ఇంప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్ని గమనించిన శైలజ తనకో చిన్న టెస్ట్ పెడుతుంది. హీరోనేమో ఆమెని కలవడం డెస్టినీ అంటుంటే ఒకవేళ అదే నిజమైతే తన చేతినుండి మిస్ అయిన మెగజైన్ వాళ్ళని కలుపుతుందని మెలిక పెడుతుంది. హీరోయిన్ ఊహించినట్టుగానే హీరో ఆమెను ఇంప్రెస్ చేసి లవ్ లో పడేస్తాడు. ఇక సడెన్ గా ఓ గ్యాంగ్ వచ్చి శైలజని ఎత్తుకెళ్లిపోతుంది. కలకత్తాని గడగడలాడించే పి.ఆర్ కూతురు శైలజ. ఆమెకి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఇదిలా జరుగుతుంటే సినిమా ఓపెనింగ్ లోనే హీరోయిజం ప్రదర్శించడం కోసం ఓ విలన్ గ్యాంగ్ తో పెట్టుకుని విలన్ కొడుకుని కొడతాడు శ్రీను. అయితే ఆ గ్యాంగ్ పగబట్టి హీరో ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. ఆ విలన్ గ్యాంగ్ చెప్పిన కట్టు కథ విని కలకత్తా పి.ఆర్ కూతురిని ఎత్తుకెళ్లడానికి వస్తాడు హీరో. ఇంతకీ పి.ఆర్ కూతురికి హైదరాబాద్ లో ఉన్న విలన్ గ్యాంగ్ కి సంబంధం ఏంటి..? విలన్ గ్యాంగ్ హీరో ఫ్యామిలీ మీద ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది..? పి.ఆర్ పై శ్రీను ఎలా తన సత్తాతో గెలిచాడు.? అనేది అసలు కథ..

సాంకేతిక నిపుణత :

సౌఖ్యం సినిమాకు పనిచేసిన సాంకేతిక విభాగం మొత్తం మంచి సహకారాన్ని ఇచ్చారనే చెప్పాలి. సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన ప్రసాద్ మూరెళ్ల చాలా మంచి లొకేషన్స్ లో షూట్ చేశారు. తెర మీద గోపీచంద్ చాలా అందంగా చూపించారు. ఇక సినిమాకు ఎక్కువ ప్రాణం పోసింది సంగీతం అయితే లౌఖ్యంతో పోల్చితే ఈ సినిమాలో కాస్త అనూప్ పట్టు తప్పాడు. ఓవరాల్ గా సినిమాకు పాటలు పర్వాలేదనిపించాయి. గౌతం రాజ్ ఎడిటింగ్ ప్రభావం సినిమాపై బాగానే కనిపించినా సినిమా అక్కడక్కడ కాస్త లాగ్ అవుతుండటంతో ఇంకాస్త ట్రిం చేసి ఉండాల్సింది అనే అనిపిస్తుంది. దర్శకత్వంలో ఎ.ఎస్.రవికుమార్ మరోసారి తన ప్రతిభను కనబర్చినా సినిమాలో కథలో అసలు దమ్ములేకుండా ఉందన్నది వాస్తవం. సినిమా మొత్తం కామెడీతో నింపాలని ప్రయత్నించినా కాస్త బోర్ అనిపించక తప్పదు.

నటీనటుల ప్రతిభ – విశ్లేషణ :

లౌఖ్యం ఫ్లేవర్ తోనే సౌఖ్యం అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు గోపీచంద్. సినిమా కథ రాసుకున్న శ్రీధర్ కాస్త కొత్తగా ఆలోచించినా మళ్లీ దానికి రొటీన్ కామెడీ అతికించి మరోసారి రోత పుట్టించేలా చేస్తుంది ఈ సినిమా. గోపీ మోహన్, కోనా వెంకట్ ల చేయి పడ్డ ఈ సినిమా మళ్లీ రెగ్యులర్ సినిమాల మాదిరిగానే అందరిని బకరాలను చేయడం కనిపిస్తుంది. సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ అసలు కుదరలేదని చెప్పాలి. గోపీచంద్ క్యారక్టర్ లో ఒక నిర్ధిష్టమైన గమ్యాన్ని లేకుండా చేశాడు రచయిత. ఇక దర్శకత్వం పరంగా ఓకే అనిపించినా ఇంకా ఎ.ఎస్.రవికుమార్ ప్రతిభను మెరుగుపరచుకోవాల్సి ఉందనిపిస్తుంది. సినిమాలో రాసుకున్న కామెడీ సీన్స్ వరకు మంచి కామెడీ పండించేలా డైరెక్ట్ చేశాడు రవికుమార్. సినిమా మొత్తం మంచి నిర్మాణ విలువలతో భవ్య క్రియేషన్స్ యొక్క నిర్మాణ సామర్ధ్యాన్ని చూపిస్తాయి.

ఇక నటీనటుల విషయానికొతే సరైన క్యారక్టరైజేషన్ లేకపోయినా గోపీచంద్ తన మీదే వేసుకుని సినిమా మొత్తం నడిపించాడు. కొన్ని సీన్స్ లో గోపీచంద్ నటన ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఇక వరుసెంట సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న రెజినా కూడా తన పాత్ర పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. సినిమాలో అమ్మడు అటు క్యూట్ లుక్స్ తో అదగొడుతూనే పాటల్లో కాస్త హాట్ గా కనిపించి అలరించింది. సినిమాకు బలం అనుకున్న కామెడీ టీం సినిమా మొదలై ట్రైన్ లో పోసాని కామెడీ నుండి ప్రి క్లైమాక్స్ బ్రహ్మానందంతో చెవిటి వాడిలా చేసిన కామెడీ దాకా సినిమా మొత్తం కామెడీ పరంగా ఓకే అనిపిస్తుంది. కాని థియేటర్ నుండి బయటకు వచ్చిన ఆడియెన్స్ సినిమాలో విషయం ఏం లేదు అనేయడం ఖాయం. 30 ఇయర్స్ పృధ్విరాజ్ మరోసారి కామెడీ స్పూఫులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా లౌఖ్యం లానే హిట్ కొడదామనుకుని వచ్చిన సౌఖ్యం కేవలం కామెడీని నమ్ముకునే ప్రేక్షకులముందుకు వచ్చింది. సినిమా మాత్రం కొత్తగా అనిపించేది ఏది లేదు..

ప్లస్ పాయింట్స్ :

గోపీచంద్
కామెడీ సీన్స్
రెజినా

మైనస్ పాయింట్స్ :

కథ, కథనాలు
సంగీతం

తీర్పు:

సౌఖ్యం అని వినసొంపైన టైటిల్ పెట్టగానే సినిమా కుటుంబమంతా చూడదగ్గ సినిమా అనే భావన ముందే కలుగుతుంది. ఆ విధంగా సినిమా గురించి వదిలే ట్రైలర్స్, పోస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే రొటీన్ గా సాగే కథ కథనాలతో మరోసారి ఆడియెన్స్ సహనాన్ని పరీక్ష పెట్టేలా చేస్తుందని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ మాత్రం పర్వాలేదనిపించినా సినిమా కథలో ఎలాంటి దమ్ము లేకుండా వచ్చింది ఈనాటి సౌఖ్యం. కథ కథనాలతో సంబంధం లేకుండా కొన్ని కామెడీ సీన్స్ చూసి ఎంజాయ్ చేద్దామనుకునే వారు తప్ప ఈ సినిమా చూసే ప్రయత్నం చేయరు. ఫైనల్ గా ఇది ఓ కంటెంట్ లేని కామెడీ ‘సౌఖ్యం’ అని మాత్రం చెప్పొచ్చు.

నటీనటులు : గోపీచంద్, రెజినా కాసండ్ర, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి,బ్రహ్మనందం, పృధ్వి, రఘుబాబు తదితరులు
కథ-మాటలు : శ్రీధర్ శ్రీపాణి
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం : ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
నిర్మాత : ఆనంద్ ప్రసాద్
తెలుగు360 రేటింగ్ : 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

కన్నప్ప.. అంతా శివయ్య మహిమ

https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నిమిషన్నర నిడివి గల టీజర్ లో యాక్షన్ ఘట్టాలకు పెద్దపీట వేశారు....

అందుకే.. వంగలపూడి అనితకు హోంశాఖ!

ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా నేత వంగలపూడి అనితకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ సభ్యులను కూడా కాదని అనితకు హోంశాఖను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది....

విష్ణు క‌న్న‌ప్ప వెనుక కృష్ణంరాజు

రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'క‌న్న‌ప్ప‌'. త‌న సొంత బ్యాన‌ర్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు న‌టుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్ర‌భాస్‌తో...

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close