అయోధ్య రామాలయ నిర్మాణానికి సన్నాహాలు?

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి చిన్నగా పనులు మొదలౌతున్నాయా? ”అవును” అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి.

దేవాలయాన్ని కట్టడానికి వుపయోగించే గండశిలలు గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి లారీల్లో అయోధ్య చేరుకోవడం వారం క్రితమే మొదలైంది. ఆలయాన్ని ‘ఇపుడు’ నిర్మిస్తామని మోడీ ప్రభుత్వం నుండి తమకు ‘సంకేతాలు’ వచ్చాయని మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు.

ఈ శిలలు అయోధ్య చేరడాన్ని, గోపాల్ దాస్ ప్రకటన చేయడాన్ని జెడియు పార్టీకి చెందిన సి.త్యాగి బుధవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ”మతపరంగా ఉద్రిక్తతతో కూడిన వాతావరణాన్ని సృష్టించే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముందు ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి” అని త్యాగి వ్యాఖ్యానించారు.

మత ఘర్షణలు రెచ్చగొట్టి ఉత్తరప్రదేశ్‌ను చీల్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్‌, ఎస్‌పి, జెడియు సభ్యులు ధ్వజమెత్తారు.

Ramalayam in Ayodhya 1

కోర్టు తీర్పును గౌరవిస్తామని, దానికే కట్టుబడి వుంటామని పార్లమెంట్‌ వ్యవహారాల సహాయ మంత్రి నక్వి చెప్పారు.ఆలయ నిర్మాణం కోసం శిలలు చెక్కడమనేది వివాదాస్పద స్థలం నుండి ఒకటిన్నర కిలో మీటరు దూరంలో 1990 నుండి కొనసాగుతూనే వుందని చెప్పారు. ఈ వివాదంపై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం, బిజెపి వున్నాయన్నారు. శిలలు చెక్కడంపై, అయోధ్యలో మత నాయకులు నివసించడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. అక్కడ శిలలు చెక్కుతున్నారంటే ఆలయం నిర్మించబడుతోందని అర్ధం కాదన్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు వేచి వుండండి, మనందరం కూడా ఆ కోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని నక్వి చెప్పారు.

అయితే ఆ ప్రకటనతో ప్రతిపక్ష సభ్యులె వరూ కూడా సంతృప్తి చెందలేదు. సభావేదిక వద్దకు దూసుకువెళ్ళి గట్టిగా నినాదాలు చేశారు. ”మతోన్మాదాన్ని, హింసను రెచ్చగొట్టేందుకు పన్నిన కుట్రను ఆపండి” అంటూ నినదించారు. ఈ గందరగోళం వల్ల సభను రెండు సార్లు వాయిదా వేశారు.

పార్లమెంట్‌ బయట బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి మీడియాతో ”అయోధ్యలో ఆలయ నిర్మాణమనేది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో ఎప్పటినుండో వుంది కానీ, భారత ప్రభుత్వం అటువంటి వారికి బ్రేకులు వేయాలి…అక్కడ యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘించబడితే యుపిలో అధికారంలో వున్న సమాజ్ వాది పార్టీ కూడా అందుకు బాధ్యత వహించాల్సి వుంటుందని అన్నారు.

విశ్వహిందూపరిషత్, ఆర్ ఎస్ ఎస్, బిజెపి కార్యకర్తలు 1992 డిసెంబరు 6 న అయోధ్యలో బాబరీ మసీదు ని కూల్చివేసినప్పటి మత ఉద్రిక్తతలు ఇప్పటికీ అపుడపుడూ తల ఎత్తుతూనే వున్నాయి. తీర్పు వెలువడే వరకూ యధాతధ స్ధితినే కనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజకీయ అవసరం పడినప్పుడల్లా బిజెపి ”అయోధ్య రామాలయ నిర్మాణం” అంశాన్ని తెరముందుకి తీసుకువస్తూనే వుంటుంది.

కాగా.. అయోధ్య స్థలంపై అరవై ఏళ్లుగా సాగుతున్న వివాదాలకు సంబంధించి కోర్టు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టింది. మొదటిది 1538కి ముందు వివాదాస్పద స్థలంలో ఆలయం వుందా?, రెండవది 1961లో బాబ్రీ కమిటీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ – పరిమితుల పేరుతో నిషేధానికి గురైందా?, మూడవది. ముస్లింలు ప్రతికూల మార్గంలో స్థలంపై హక్కును పొందారా? అనే మూడు అంశాలపై దృష్టి సారించింది. ఈ స్థల వివాదంపై మొదటి కేసు 1950లో గోపాల్‌సింగ్‌ విశారద్‌ అనే వ్యక్తి కోర్టుల దావా వేశారు. ఈ అయోధ్య స్థలంలో శ్రీరాముని పూజించేందుకు అనుమతిని ఇవ్వాలంటూ ఆయన తన పిటిషన్ లో కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close