ఈ మధ్య ఎక్కువగా కామెడీ సినిమాలు చేసిన శ్రీవిష్ణు ఆ జానర్ కి బ్రేక్ ఇచ్చిన చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’. హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది. తాజాగా టీజర్ వదిలారు.
”ఒక మనిషి అతని గురించి మూడు విషయాలు మార్చుకోలేడు. మొదటిది వాడి హైట్. ఇప్పుడు అది అప్రస్తుతం. రెండోది.. వాడు చూసే విధానం. మూడోది.. ఏంటో తెలుసుకునే ఆసక్తి కలిగించేలా టీజర్ కట్ చేశారు.
ఓ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రత్యేక్షంగా చూసిన హీరోకి అది హత్య అనే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఇందులో ఇన్వెస్టిగేట్ పాయింట్.
శ్రీవిష్ణు లుక్ కొత్తగా వుంది. ఇందులో డబుల్ యాక్షన్ వుందని హింట్ ఇచ్చేలా వచ్చిన క్లైమాక్స్ షాట్ క్యురియాసిటీ పెంచింది. శ్రీవిష్ణు స్వయంగా ‘హీరోనే’ అని పరిచయం చేసుకోవడం కొసమెరుపు. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.