శ్రీరామ్ ఆదిత్య భలే మంచి ఛాన్స్ కొట్టాడా..?

మొదటి సినిమా హిట్ అయితే వచ్చే కిక్కే వేరబ్బా అని.. మొదటి సినిమా ఊహించని విధంగా ట్రెండ్ సెట్ చేస్తే నిజంగా ఆ థ్రిల్లే వేరబ్బా అని అంటాడేమో శ్రీరాం ఆదిత్య. కుర్రాడు భలే మంచి రోజు ఆడియో వేడుకలోనే మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్య పరచింది. సినిమా విడుదలకు ముందే సినిమా మీద అంత నమ్మకన్ని పెట్టుకున్న దర్శకుడు శ్రీరాం ఆదిత్య. సినిమా హిట్ అయిన విధానాన్ని చూస్తే అది నిజమే అనుకునేలా చేశాడు. సుధీర్ బాబుకి సోలో హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు వెంట ఇప్పుడు నిర్మాతలు క్యూలు కడుతున్నారట.

ప్రస్తుతం భలే మంచి రోజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీరాం ఆదిత్య. ఇక రెండో సినిమా ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్టు తెలుస్తుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ శ్రీరాం టేకింగ్ నచ్చాడని.. కథ చర్చల్లో కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. రెండవ సినిమానే స్టార్ హీరోని దర్శకత్వం వహించే అవకాశం కొట్టేసి సూపర్ అనిపించుకున్నాడు శ్రీరాం ఆదిత్య.

ప్రస్తుతం భలే మంచి రోజు సక్సెస్ టూర్ అంటూ విజయయాత్రలు చేస్తుంది చిత్ర యూనిట్. విజయయాత్రలు ముగించుకున్న తర్వాత రవితేజ సినిమా మీద దృష్టి పెడతాడట దర్శకుడు శ్రీరాం ఆదిత్య. ఇప్పటికే రవితేజ మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు మరి శ్రీరాంతో ఎప్పుడు సినిమా తీస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేలిపోయిన ఇన్‌సైడర్ కుట్ర..! ఇక జగన్ ఏం చేస్తారు..!?

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయవర్గాల్లో సైతం సంచలనం సృష్టిస్తోంది. ఓ వర్గం మీడియా ఈ తీర్పును పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. అసలు తీర్పులో ఉన్న అంశాలను చూస్తే.. ప్రభుత్వం...

రాత్రి పదిన్నరకు జగన్‌కు షా అపాయింట్‌మెంట్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్‌మెంట్ పదిన్నర తర్వాత ఖరారయింది. మద్యాహ్నమే విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన జగన్... అమిత్ షా తో భేటీ కోసం తనతో పాటు మిధున్...

చిరు దృష్టిలో ప‌డిన గోపీచంద్ మ‌లినేని

ఓ హిట్టు సినిమా వ‌చ్చిందంటే.. ముందుగా స్పందించే స్టార్ చిరంజీవినే. ద‌ర్శ‌కుడినో, చిత్ర‌బృందాన్నో ఇంటికి పిలిపించి మ‌రీ అభినందిస్తుంటాడు. ఇప్పుడు త‌న దృష్టి గోపీచంద్ మ‌లినేనిపై ప‌డింది. ఈ సంక్రాంతికి `క్రాక్‌`తో సూప‌ర్...

ప‌వ‌న్ – క్రిష్‌.. 20 రోజుల బ్రేక్‌!

వ‌కీల్ సాబ్ షూటింగ్ ముగించుకుని.. క్రిష్ సినిమా మొద‌లెట్టాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ సాగుతోంది. గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో నైట్...

HOT NEWS

[X] Close
[X] Close