కడపలో కాదు ఒడిషాలో స్టీల్ ప్లాంట్..!

ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ తీసుకు రావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్కో వస్తోందని… రావాలని ఆయన కోరుకుంటున్నారు. చర్చలకు రావాలని.. కృష్ణపట్నంలోనే కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామనిలేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి.. శంకుస్థాపన కూడా చేారు. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ.. ఉక్కు మంత్రి మాత్రం.. తన రాష్ట్రానికి మాత్రం.. రూ. యాభై వేల కోట్లతో ప్రైవేటు పరిశ్రమను తరలించుకుపోయారు. ప్రపంచ ఉక్కు దిగ్గజం… ఆర్సెలార్ మిట్టర్..ఇండియాలో ఓ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఆ ప్లాంట్ కోసం.. ఉక్కు మంత్రి తన పలుకుబడి అంతా ఉపయోగించుకుని ఒడిషాకు తరలించుకుపోయారు. ఏపీలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను మాత్రం ప్రైవేటీకరణ చేయడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుడా ఉండటానికి క్యాప్టివ్ మైన్స్ ఉంటే చాలని.. లాభాల్లోకి వస్తుందని.. బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. పోస్కోకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయని…. సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టర్ ఒడిషాలో ప్లాంట్ పెట్టడానికి క్యాప్టిన్ మైన్స్‌ను కూడా కేటాయించాల్సి ఉంది. రూ. యాభై వేల కోట్ల పెట్టుబడి అంటే.. చిన్న విషయం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిమాండ్ మొత్తం… ఆ ప్లాంట్‌కు తరలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.

ఓ రకంగా.. ఆ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే..ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభ మసకబారడం ఖాయమని అంటున్నారు. ఆ ప్లాంట్ తో విశాఖ పోటీ పడాలంటే.. క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించాల్సి ఉంటుంది. సీఎం జగన్.. ప్రత్యేకంగా చొరవ తీసుకుని విభజన హామీ ప్రకారం.. పెట్టాల్సిన స్టీల్ ప్లాంట్‌ను ఏపీకి తీసుకు వస్తే.. పారిశ్రామికీకరణలోగొప్ప విజయం సాధించినట్లే చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close