పవన్‌పై పంచ్ పడింది!

హైదరాబాద్: సినిమాల్లో విలన్‌లపై పంచ్‌లు వేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పైనే పంచ్ పడింది. సీనియర్ జర్నలిస్ట్, ప్రజాశక్తి పత్రిక మాజీ ఎడిటర్ తెలకపల్లి రవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పంచ్ వేశారు. “చూడప్పా సిద్దప్పా సినిమాల్లో ఉంటావా? లేక రాజకీయాలు చేసుకుంటావా? ఏదో ఒకటి తేల్చుకో” అని సూచించారు. రవి ఇవాళ ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎవరి తరపున ప్రశ్నిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. గబ్బర్ సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కు వచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు చెప్పిన సమాధానాలనే ప్రజలకు పవన్ చెప్పటంవలన ఉపయోగమేమీ లేదని చెప్పారు. చంద్రబాబుకు గెస్ట్‌గా ఉండకూడదని అన్నారు. గెస్ట్ ఆర్టిస్ట్‌లా ఎప్పుడో ఒకసారి ప్రజలకు కన్పించి ఏవో నాలుగైదు డైలాగులు చెప్పటం వలన ప్రయోజనమేమిటని అడిగారు. ప్రత్యేక హోదాగానీ, ప్యాకేజ్ గానీ ఇవ్వకపోతే చూద్దాం అంటున్న పవన్ కాలాన్ని వృథా చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైకూడా రవి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తాను రాయలసీమ బిడ్డనని పదేపదే చెప్పుకోవటంవల్ల ఉపయోగమేమిటని ప్రశ్నించారు. త్వరలో కట్టబోటే అమరావతి రాజధాని స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచర్ అని ఆరోపించారు. అమరావతి చుట్టూ 21 నగరాలు నిర్మిస్తామని చెబుతున్నారని, అసలు అమరావతి పట్టణాన్ని ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close