మూడు రోజుల్లో రు.100 కోట్లు దాటేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ మొదటి మూడు రోజులలోనే రు.100 కోట్ల మైలురాయిని దాటేసింది. దీపావళి మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,600 ధియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిందీ వెర్షన్ ఒక్కటే ఈ ఘనతను సాధించటం విశేషం. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమలీల’ పేరుతో, తమిళంలో ‘మై మరంతాయో అంబే’ పేరుతో డబ్ అయింది. ఆ చిత్రాల కలెక్షన్స్ చేర్చకుండానే మూడు రోజులలో వందకోట్ల క్లబ్‌లో చేరింది. గురువారం మొదటి రోజున రు. 40.35 కోట్లు, శుక్రవారం రెండో రోజున రు.31.05 కోట్లు, శనివారం మూడో రోజున రు.30.07 కోట్లు గడించింది. అయితే మొదటి రోజు ఓపెనింగ్స్‌లో షారుఖ్ ఖాన్ ‘హ్యాపీ న్యూఇయర్’ చిత్రంతో నెలకొల్పిన రు.42.62 కోట్ల రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ మూడు వెర్షన్స్ కలిపి రు.44.97 కోట్లు గడించింది. మరోవైపు ‘బాహుబలి’ మూడు వెర్షన్స్ కలిపిన ఓపెనింగ్స్ రికార్డ్ కూడా ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. ఈ చిత్రం మొదటిరోజున మూడు వెర్షన్స్ కలిపి రు.50 కోట్లు గడించింది. ‌రివ్యూలలో మిశ్రమ స్పందన వ్యక్తమయినప్పటికీ కలెక్షన్స్ బాగుండటం ఈ చిత్రంలో మరో విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close