వినాయక్ కొంప ముంచిన అఖిల్

స్టార్ హీరో కొడుకుని తన చేతిలో పెట్టి ఆ హీరో భవిష్యత్తుని నిర్ధేశించే హిట్ సినిమా ఇవ్వమని నాగ్ వినాయక్ మీద మంచి బరువు పెట్టాడు. అయితే అఖిల్ డెబ్యూని మాత్రం గ్రాండ్ గా ఇచ్చాడు గాని తన పరిస్థితిని అయోమయంలో పడేసుకున్నాడు డైరక్టర్ వినాయక్. స్వతహాగా కథలు రాయలేని వినాయక్ ఎప్పుడు బయట కథలకే అద్భుతమైన డైరక్షన్ చేస్తాడు ఒక్కోసారి అవి బెడికి కొట్టడం జరుగుతుంది. అఖిల్ విషయంలోనూ అదే జరిగింది. ఇక అఖిల్ నిర్ణయంతోనే మెగాస్టార్ చిరు ముడిపడి ఉందన్న విషయం గ్రహించక ఆ చాన్స్ కూడా మిస్ చేసుకున్నాడని అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్.

మెగాస్టార్ రీ ఎంట్రీ గా వస్తున్న 150వ సినిమాకు వినాయక్ డైరక్టర్ గా ఖాయమనుకున్నారు. పూరి ఎంత ప్రయత్నించినా కథ బాలేదని చెప్పి తప్పించుకున్న చిరు వినాయక్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. కాని అఖిల్ రిజల్ట్ తో ఇప్పుడు వినాయక్ మీద ఉన్న నమ్మకం కూడా సడలిందని టాక్. మొన్నటిదాకా దర్శకుడు ఓకే కథ మాత్రం దొరకలేదు అన్నారు. తాజాగా దర్శకుడు కూడా లేడని మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న వార్తలు.

మరి ఇదే నిజమే అయితే వినాయక్ కాకుండా చిరంజీవి 150వ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇప్పుడు మరో హాట్ న్యూస్. మొత్తానికి అఖిల్ సినిమా అంచనాలకు చేరుకోకపోవడంతో చిరు నిర్ణయంలో మార్పు వచ్చి వినాయక్ ని సినిమా నుండి తొలగించారన్నది తాజా సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com