ఛాన్సు వస్తే నీతో చేస్తా..!

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు ఇంకా ఒక స్టార్ ఇమేజ్ ని సంపాధించలేకపోయాడు. సినిమాలైతే వరుసెంట చేస్తున్నాడు కాని అతని సినిమాలు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి. డిఫరెంట్ సినిమాల అటెంప్ట్ చేస్తున్నా ఒక స్టార్ గా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. రీసెంట్ గా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమాతో పర్వాలేదనిపించుకున్న సుధీర్ బాబు తన లేటెస్ట్ మూవీ భలే మంచి రోజు సినిమాతో వస్తున్నాడు.

శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా చేస్తుంది. రీసెంట్ గా వదిలిన సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా టీజర్ గురించి టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ప్రమోట్ చేయడం మెచ్చుకోదగిన విషయం. ప్రామిసింగ్ టీజర్ తో వస్తున్న సుధీర్ బాబుకి రకుల్, తమన్న లాంటి వారు తమ బెస్ట్ విశెష్ ని ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఈ దారిలోనే తమన్నా విశెష్ కి రిప్లైగా నీతో డ్యాన్స్ చేయాలని ఉంది అని సుధీర్ ట్విట్టర్లో అడిగేశాడు. అయితే దానికి తమన్నా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ ఇలా ఒక హీరోయిన్ ని ఛాన్స్ అడగటం ఆశ్చర్యంగా అనిపించినా.. బడా ప్రొడ్యూసర్ ని పట్టుకుని హీరోయిన్ గా బుక్ చేసుకుంటే సరి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తమన్నాతో రొమాన్స్ చేయాలనే కోరికను సుధీర్ బాబు బయటపెట్టడంతో గురుడికి అమ్మడు ఎక్కడో గుచ్చుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దొరికితే త్వరలో ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఎక్స్ పెక్ట్ చేయోచ్చన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాక్‌డౌన్ 5.0 ఖాయమే..! కాకపోతే పేరుకే..!?

నాలుగో లాక్ డౌన్ గడువు కూడా ముంచుకొస్తోంది. మరో మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి..? తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలనే ఆలోచనలనే కేంద్రం ఉంది....

సూర్య బ్ర‌ద‌ర్స్‌ని క‌లిపిన రీమేక్‌

సూర్య హీరోగా నిల‌దొక్కుని, ఓ ఇమేజ్ సాధించిన త‌ర‌వాతే... కార్తి రంగ ప్ర‌వేశం చేశాడు. తాను కూడా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక్క సినిమాలోనూ న‌టించ‌లేదు....

జగన్ కొత్త కాన్సెప్ట్ : రైతులకు వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్ ..!

రైతులకు వన్ స్టాప్ సర్వీస్ సెంటర్‌ను జగన్ ఏర్పాటు చేస్తున్నారు. అదే రైతు భరోసా కేంద్రం. రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు ఆ కేంద్రంలో తీరేలా .. ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది పాలన...

అత్యంత ఎత్తులోకి గోదావరి జలం.. కేసీఆర్ పట్టుదలకు మరో విజయం..!

తెలంగాణ సీఎం కేసీఆర్... తాను గురువుగా పూజించే చినజీయర్‌ను కలిసి.. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి కారణం అది ఆయన సొంత గడ్డ సిద్ధిపేటలో...

HOT NEWS

[X] Close
[X] Close