చేతిలో అన్నపూర్ణ లాంటి సంస్థ వున్నా, అక్కినేని బ్యాక్ గ్రౌండ్ వున్నా సరైన హిట్ లేక కామ్ అయిపోయాడు సుమంత్. ఏమో గుర్రం ఎగరా వచ్చు తరవాత అసలు సినిమాలే లేదు. మధ్యలో కొన్ని కాంబినేషన్లు అనుకున్నా వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి హడావిడి చెయ్యకుండా సైలెంట్ గా రావాలి, హిట్ కొట్టాలి అనుకున్నాడేమో.. గప్ చుప్ గా ఓ సినిమా రెడీ చేసాడు. అదే… నరుడా… డోనరుడా. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన విక్కీ డోనార్ కి రీమేక్ ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.
ఈ కధ నాని, సునీల్, రాజ్ తరుణ్… ఇలా చాలామంది యంగ్ హీరోల చుట్టూ తిరిగింది. చివరికి సుమంత్ సెట్ అయ్యాడు. మధుర శ్రీధర్ దగ్గర ఈ రైట్స్ ని అన్నపూర్ణ సంస్థ తీసుకుని… ఓ కొత్త దర్శకుడికి బాధ్యత అప్పగించారు. వాటికి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి. విక్కీ డోనర్ వచ్చి ఐదారేళ్ళు అయ్యింది. ఆ కాన్సెప్ట్ కూడా పాతబడిపోయింది. మరి కొత్తగా ఈ సినిమాలో ఎం చూపిస్తారో ? సుమంత్ కెరియర్ ని ఎలా గాడిలో పడేస్తారో ?