సునీల్ బాలీవుడ్ ఎంట్రీ.. ఖాయ‌మేనా?

హీరో పాత్ర‌ల‌పై మోజు త‌గ్గించుకుని, ఇప్పుడిప్పుడే త‌న‌కు సూట‌య్యే కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు సునీల్‌. త‌న చేతిలోనూ అవ‌కాశాలు బాగానే ఉన్నాయి. ఈ ద‌శ‌లో మ‌ళ్లీ త‌న‌కు హీరోగా ఛాన్సులొస్తున్నాయి. అయితే సునీల్ ఏం కంగారు ప‌డిపోవ‌డం లేదు. ఇది వ‌ర‌కు అడ్వాన్సులు తీసుకున్న ఒక‌రిద్ద‌రు నిర్మాత‌ల‌కే త‌ను సినిమాలు చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. అయితే ఇప్పుడు సునీల్‌కి అనుకోకుండా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అక్క‌డ రూపొందే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో సునీల్‌కి ఛాన్సొచ్చింది. ఈ చిత్రానికి తాతినేని ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు. స‌న్నీలియోన్‌, బ్ర‌హ్మానందం లాంటి స్టార్లు కూడా ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ సూప‌ర్ క‌మిడియ‌న్ హీరోలు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తార‌ని స‌మాచారం. సునీల్‌కి కూడా ఎప్ప‌టి నుంచో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల‌ని వుంది. మంచి ఆఫ‌ర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఈ అవ‌కాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడ‌ని, బాలీవుడ్‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. అయితే… ఇంకా డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేదు. త్వ‌ర‌లోనే వాటిపైనా ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close