సునీల్ చేతిలో మూడు పెద్ద సినిమాలు

క‌మిడియ‌న్ గా రీ ఎంట్రీ ఇచ్చాక సునీల్ కెరీర్ కాస్త గాడిలిలో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌తో సునీల్ ఖాతాలో ఓ మంచి పాత్ర, ఓ మంచి హిట్టు ప‌డిన‌ట్టైంది. ఇప్పుడు `చిత్ర‌ల‌హ‌రి`తో కూడా ఆక‌ట్టుకుంటున్నాడు. తేజూకి ‘గ్లాస్ మేట్‌’గా క‌నిపించి.. మంచి మార్కులు అందుకున్నాడు. సునీల్ చేతిలో మ‌రో మూడు పెద్ద సినిమాలు ప‌డ్డాయి. త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ కొత్త సినిమాలో సునీల్‌కి ఓ పాత్ర ద‌క్కింది. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ డిస్కో రాజాలో కూడా సునీల్ న‌టిస్తున్నాడు. చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలోనూ సునీల్‌కి ఛాన్స్ దొరికిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని సునీల్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించాడు కూడా. ”నేను ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న క‌ల తీర‌బోతోంది. త్వ‌ర‌లో ఓ పెద్ద సినిమాలో, ఓ పెద్ద హీరోతో క‌ల‌సి న‌టించ‌బోతున్నా. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా” అంటూ హింట్ ఇచ్చాడు సునీల్‌.

చిరంజీవి 150వ చిత్రంలో సునీల్‌కి ఛాన్స్ వ‌చ్చింది. కానీ అప్ప‌ట్లో కాల్షీట్లు స‌ర్దుబాటు కాలేక ఆ సినిమాని వ‌దులుకున్నాడు. ఇప్పుడు మాత్రం సునీల్ మెగా ఛాన్స్‌ని వ‌దులుకునే స్థితిలో లేడు. అయితే హీరోగా మాత్రం సునీల్ కెరీర్‌కి పుల్ స్టాప్ ప‌డిన‌ట్టే. ఈ విష‌యాన్ని సునీల్ స్వ‌యంగా చెప్పాడు. ”క‌థానాయ‌కుడిగా చేయాల్సిన సినిమాలు రెండున్నాయి. ఎందుకంటే ఆ సినిమాల‌కు సంబంధించి ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చుకున్నాను. ఆ సినిమాల్ని పూర్తి చేయాల్సిన బాధ్య‌త నాది. అవి మిన‌హాయిస్తే.. హీరోగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోద‌ల‌చుకోలేదు” అని క్లారిటీ ఇచ్చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close