ఎన్నికల నిర్వహణలో అపసోపాలు..! సుప్రీంకోర్టు ముంగిట ఈసీ ..!

దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత దిగువ స్థాయిలో ఉంది. ఆ విషయంలో పదే పదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో తేలిపోయింది. మొదట్లో… మీ అధికారులు మీకు తెలుసా.. అని ఈసీని సూటిగా సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో చురుకుపుట్టి.. కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కొంత మందిపై ఈసీ చర్యలు తీసుకుంది. కానీ.. మోడీ, షాలపై మాత్రం.. చర్యలు తీసుకోలేకపోయారు. వేచి చూసి.. చూసి.. క్లీన్ చిట్ ఇవ్వడం ప్రారంభించారు. దాంతో.. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లింది. కోడ్ ఉల్లంఘించినట్లు స్పష్టమైన ఆధారాలు చూపి.. ఈసీ వివక్ష చూపించిందని.. ఆరోపిస్తోంది. దీంతో.. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

ఇప్పుడు.. వీవీ ప్యాట్ల లెక్కింపుపైనా అబద్దాలు చెప్పాలని.. మరోసారి 22 పార్టీలు కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. గతంలో ఇదే అంశంపై విచారణ జరిగిన సమయంలో 50 శాతం వీవీప్యాట్‌ల స్లిప్పుల లెక్కించడానికి కనీసం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం వాదించింది. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరిగినప్పుడే.. లెక్కింపునకు 24 గంటలకు మించి సమయం పట్టలేదని, ఇవీ బ్యాలెట్‌ తరహాలోనే లెక్కించాలి కాబట్టి పెద్దగా సమయం పట్టబోదని వాదించబోతున్నారు దీనిని టెక్నికల్‌గా నిరూపించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.

యాభై శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాల్సిందేనని టీడీపీ సహా దేశంలోని 22 పార్టీలు కోరుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీ ప్యాట్‌లు లెక్కించాలంటూ సుప్రీం ఆదేశాలపైనా ఈ పార్టీలు సంతృప్తి చెందలేదు. సగం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిందేనంటున్నాయి. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లుతుందని దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ వాదిస్తున్నాయి. ఓటు ఎవరికి వేశామో నిర్ధారించుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లు ప్రవేశపెట్టారని.., ఆ స్లిప్పులు లెక్కించడం ద్వారా మరింత పారదర్శకత వస్తుందని వాదిస్తున్నాయి. ఈసీ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో.. దాన్నే… సుప్రీంకోర్టులో ప్రధాన సాక్ష్యంగా విపక్ష పార్టీలు ఉపయోగించుకోబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close