కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు తమిళనాడుకి కావేరీ నీళ్ళు వదలాలని తన ఆదేశాలని పాటించనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 1 నుంచి 6 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల తమిళనాడుకి తప్పనిసరిగా నీళ్ళు విడుదలచేయాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టంగా చెప్పింది. ఈసారి తన ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తే సహించబోనని కూడా హెచ్చరించింది. అలాగే ఈ వివాదం పరిష్కారం కోసం అక్టోబర్ 4వ తేదీ లోగా కావేరీ రివర్ బోర్డుని ఏర్పాటు చేయాలని, రేపటిలోగానే దానికి సభ్యులని నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

కావేరీ జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు మొదటిసారి ఆదేశాలు జారీ చేసినప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానిలో పాల్గొన్న ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు ఆదేశాలని పట్టించుకోవద్దని, అవసరమైతే ముఖ్యమంత్రికి తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చాయి. మంత్రివర్గ సభ్యులు కూడా అలాగే చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. ఈసారైనా సుప్రీంకోర్టు ఆదేశాలని సిద్ద రామయ్య పాటిస్తారో లేదో? పాటించక పోతే సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకొంటుందో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close