టిల్లు కోసం క్యూలో మ‌రో ద‌ర్శ‌కుడు

‘డీజే టిల్లు’తో స‌డ‌న్ స్టార్ అయిపోయాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. టిల్లు స్క్వేర్ కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఊపేసింది. దాంతో సిద్దు క్రేజ్ మ‌రింత పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టే త‌న పారితోషికాన్ని మూడొంత‌లు పెంచేశాడు సిద్దు. ఇప్పుడు త‌న రెమ్యున‌రేష‌న్ రూ.15 కోట్లు. అయినా స‌రే, త‌న‌తో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. కార‌నీ టిల్లు మాత్రం ఖాళీగా లేడు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో ‘జాక్‌’ చేస్తున్నాడు. ఆ త‌ర‌వాత ‘టిల్లు క్యూబ్’ ఉంటుంది. ఇవి కాకుండా మ‌రో రెండు క‌థ‌ల‌కు సంత‌కాలు చేశాడు. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు టిల్లు కోసం ఓ క‌థ రెడీ చేసి క్యూలో నిల‌బ‌డ్డాడు. త‌నే… సురేంద‌ర్ రెడ్డి.

‘ధృవ‌’తో సూప‌ర్ హిట్ కొట్టాక సూరి ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయాడు. ‘సైరా’, ‘ఏజెంట్‌’.. ఇలా ఒక‌దాని త‌ర‌వాత మ‌రో ప‌రాభ‌వం. దాంతో సూరి తేరుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టింది. మ‌ధ్య‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా అనుకొన్నారు కానీ, అది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ఛాన్సులు క‌నిపించ‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కూ ఓ బాలీవుడ్ హీరోతో ట‌చ్‌లో ఉన్నాడు. కానీ ఆ సినిమా కూడా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో సినిమా చేయ‌డానికి ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు టాక్. అయితే సూరి స్టైల్ వేరు, సిద్దుకు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండింటినీ మ్యాచ్ చేసే విష‌యం ఆ క‌థ‌లో ఉంటే.. ఈ కాంబో ప‌ట్టాలెక్కేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close