గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

“ఆయన లేని లోటు పూడ్చలేనిది” సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మాత్రం వందకు వంద శాతం ఆ మాటకు తగిన వ్యక్తి. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ నేటికి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామానాయుడు సినిమాలు, నిర్మాతగా ఆయన ఔదార్యం, మనిషిగా ఆయన మంచితనం, నిర్మాణ రంగంలో ఆయన లేని లోటు గుర్తుకొస్తున్నాయి.

రామానాయుడు ఎంతగొప్ప నిర్మాత? ఎలాంటి అద్భుతమైన చిత్రాలు తీశారు? ఇవన్నీ అందరికీ తెలిసినవే. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివి. ఆయన్ని భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో గౌరవించింది. ఫాల్కే అవార్డ్ వరిచింది. వందకుపైగా చిత్రాలు , అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీసిన నిర్మాతగా గిన్నిస్ రికార్డ్ కెక్కారు. ఇదంతా ఆయన ఘన చరిత్ర. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ ఆయన వైభవాన్ని కొనసాగించిందా? అనే ప్రశ్న వేసుకుంటే లేదనే సమాధానమే వస్తుంది.

రామానాయుడు వున్నప్పుడు స్టూడియోలో ఆయనవే నాలుగైదు సినిమాలు జరిగేవి. జయాపజయాలకు, నష్టాలకు భయపడకుండా కేవలం సినిమానే ఒక వ్యవసాయంగా పడించేవాడాయన. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమాలు నిర్మించేవారు. ఒక పెద్ద సినిమా జరుగుతుండగానే అంతా కొత్తవారితో ఒక చిన్న సినిమా తీసేసేవారు. చిన్న ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కి ఆయన అంటే ఒక భరోసా. ‘నాయడు గారి దగ్గర పని దొరుకుతుంది’ అని నమ్మకంతో బతికినవారు ఎంతో మంది. ఆయన మాటిస్తే సినిమా అయిపోయినట్లే.

కానీ సురేష్ ప్రొడక్షన్స్ కి ఇప్పుడా కళ లేదు. సినిమాల నిర్మాణం పూర్తిగా తగ్గించారు. చివరికి వెంకటేష్, రానా తో కూడా సినిమాలు చేయడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక పెద్ద సినిమా వచ్చి చాలా కాలమైయింది. చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి కేవలం బ్యానర్ పేరు, స్టూడియో షూటింగ్ ఇచ్చి పార్టనర్ షిప్ లా మార్కెట్ చేసుకోవడం తప్పితే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమాలు రూపొందడం లేదు.

సినిమాని చూసే కోణంలో రామా నాయుడికి, సురేష్ బాబు కి స్పష్టమైన తేడాలు వున్నాయి. రామానాయడు సినిమాని ఒక పాషన్, ఎమోషన్ గా చూశారు. ఇక్కడ సంపాదించినది ఇక్కడే ఖర్చుపెట్టేశారు. చాలా సార్లు నష్టాలు కూడా చూశారు. ఇవన్నీ చూసిన సురేష్ బాబు.. తన జనరేష్ కి వచ్చేసరికి ఎమోషన్ తగ్గించి సినిమాని పక్కా బిజినెస్ మోడల్ గానే చూశారు. బిజినెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ష్యూర్ షాట్ హిట్ అనుకునే సినిమాలనే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది తప్పని కాదు. నిజానికి సినిమాని బిజినెస్ కోణంలోనే చూడాలి. అయితే సినిమాని విపరీతంగా ప్రేమించి, ఎన్నో సాహస ప్రయోగాలు చేసి జయాపజయాలు చూసిన రామానాయడు ఆలోచన ధోరణి పొసగని తీరిది. ఆయన సినిమాని చూసే తీరు కళాత్మకమైనది.

ఇప్పుడు చాలా మంది దర్శకులు సురేష్ ప్రొడక్షన్ గురించి మర్చిపోయారు. ఇప్పటి దర్శకుల ఆప్షన్ లో ఆ బ్యానర్ లేదు. కారణం.. సురేష్ బాబు కి కథ చెప్పి ఒప్పించడం అంటే ఇప్పట్లో అయ్యేపని కాదనే అభిప్రాయం అందరికీ వచ్చేసింది. ఇందులో వాస్తవం కూడా వుంది. కానీ ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో కొత్త సినిమా అవకాశం కోసం దర్శకులు ఎంతో ఉత్సాహంగా వుండేవారు. రామానాయడికి కథ నచ్చితే, వెంటనే అడ్వాన్సులు ఇచ్చేసి వారం లోనే షూటింగ్ మొదలయ్యేది. అంత జోరు వుండేది. ఇప్పుడా వేగం లేదు.

నిర్మాతగా చాలా గొప్ప ఔదార్యాన్ని ప్రదర్శించేవారు రామానాయడు. స్టార్ హీరోలుకి అడ్వాన్సులు ఇవ్వడం మామూలే. కానీ రామానాయడు మాత్రం చిన్న చిన్న క్యారెక్టర్ అరిస్టులకి, టెక్నిషయన్స్ కూడా అడ్వాన్సులు ఇచ్చేవారు. ఎవరైనా ఏదైనా కష్టం అని ఆయన వద్దకు వెళితే.. అప్పులా కాకుండా అడ్వాన్స్ లా డబ్బులు ఇచ్చిన నిర్మాత ఆయన. సురేష్ ప్రొడక్షన్ ఫుడ్ తినని ఆర్టిస్ట్ లేరని నానుడి. పరిశ్రమని అంతలా కళకళలాడించిన నిర్మాత రామానాయడు.

రిస్క్ తీసుకోవడం అంటే ఆయనకి మహా సరదా. చేతిలో మిగిలిన చివరి ఐదు లక్షల పట్టుకొని, అవీ పొతే ఇక రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసినా.. సినిమా పట్ల ఇష్టం, మొండి పట్టుదలతో ‘ప్రేమనగర్’ తీశారు. అది సూపర్ హిట్. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్ని హిట్లు, ఫ్లాపులు వచ్చినా ‘పోయిన దగ్గరే వెదుక్కోవాలి’ అనే తత్త్వం సినిమానే నమ్ముకొని నిర్మాణం కొనసాగించారు.

అవకాశాలు ఇవ్వడంలో కూడా ఆయనకి ఆయనే సాటి. సురేష్ ప్రొడక్షన్ లో ఎంతోమంది నటీనటులు, దర్శకులని పరిచయం చేశారు. ఒక అవకాశం ఇచ్చే ముందు గట్ ఫీలింగ్ తో ముందుకు వెళ్ళిపోవడమే కానీ ట్రాక్ రికార్డ్ చూసి అవకాశం ఇచ్చే రకం కాదు. ఆయన అవకాశాలు ఇచ్చే విధానం ఎంత డేరింగ్ &డాషింగ్ గా ఉంటుదని చెప్పదానికి ఓ ఉదారణ… హస్యనటుడు నగేష్‌ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నగేష్ దర్శకత్వంలో వచ్చిన ‘మొరటోడు’ బాగా దెబ్బకొట్టింది. కమెడియన్ కి డైరెక్షన్ ఇస్తే ఇలానే వుంటుందనే విమర్శలు వచ్చాయి. నిజానికి మరో నిర్మాత అయితే ఆ ఫలితాన్ని అండర్ లైన్ చేసుకొని మళ్ళీ అలాంటి రిస్క్ జోలికి పోరు. కానీ రామానాయడు అలా కాదు.. కొంతకాలం తర్వాత హాస్యనటుడు ఏవీఎస్ ని దర్శకుడిగా చేసి సూపర్ హీరోస్ సినిమా తీసి.. తనకి ఇలాంటి ట్రాక్ రికార్డు పట్టింపులు లేవని నిరూపించుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్ 60 ఏళ్ళు పూర్తి చేసున్న సందర్భంగా ఒక్కసారి ఆ జర్నీని గుర్తు చేసుకుంటే.. రాముడు భీముడు నుంచి మల్లీశ్వరి వరకూ రామానాయుడు హయంలో వచ్చిన చిత్రాలే కదలుడుతూవున్నాయి తప్పితే ఆయన వెళ్ళిన తర్వాత నిర్మాణ రంగంలో సురేష్ ప్రొడక్షన్ ఆయన వారసత్వాన్ని నిలబట్టే ప్రాజెక్ట్స్ చేయడంపై ద్రుష్టి పెట్టలేదనేది కళ్ళుముందు కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌ళ్లీ హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయా?

శేఖ‌ర్ కమ్ముల 'హ్యాపీడేస్‌' చాలామంది జీవితాల్ని మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోయిన‌వాళ్లు ఎంతోమంది. అందులో టైస‌న్ గా మెప్పించిన రాహుల్ కూడా 'హ్యాపీడేస్' త‌ర‌వాత హీరోగా మారాడు. కొన్ని సినిమాలు...

లిక్క‌ర్ స్కాంపై ఈడీకి ఎమ్మెల్సీ క‌విత చెప్పిన స‌మాధానాలు ఇవే

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నా పాత్ర లేదంటూ ఎమ్మెల్సీ క‌విత ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అరుణ్ పిళ్లై త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని... వీకెండ్స్ లో క‌లిసేవారిమ‌ని, అయితే నా త‌ర‌ఫున పెట్టుబ‌డి...

ఒక సినిమా.. 42 ముద్దులు

తెలుగు సినిమా అన్ని ర‌కాలుగానూ ఎదిగింది. టెక్నిక‌ల్ గా, బ‌డ్జెట్ల ప‌రంగా, వ‌సూళ్ల ప‌రంగా.. ఇప్పుడు ముద్దుల కోటాలోనూ ముందుంది. ఇది వ‌ర‌కు తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా అరుదుగా...

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మే నెలలో జరిగిన రేవ్ పార్టీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close