ఆ స్వామి మ‌ళ్లీ వ‌స్తాడండీ..!

తెలుగు సినిమాలో క్రైమ్ కామెడీ జోన‌ర్‌ని స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసిన సినిమా స్వామి రారా. ఆ త‌ర‌వాత తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలు వ‌రుస క‌ట్టాయి. ఈ సినిమాతోనే నిఖిల్ లైఫ్ ట‌ర్న్ అయ్యింది. వ‌రుస‌గా హిట్లు కొట్టి కంఫ‌ర్ట్ జోన్‌లో ప‌డ్డాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా నిరూపించుకొన్న సుధీర్ వ‌ర్మ‌.. దోచేచ్ తో బోల్తా ప‌డ్డాడు. ఇప్పుడు మ‌రోసారి నిఖిల్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. స్వామి రారాకి ఇంచుమించు సీక్వెల్‌లా ఉండే ఈ సినిమాకి సంబంధించిన క‌థ కూడా సిద్ధ‌మైంద‌ట‌. దాన్ని నిఖిల్‌కి చెప్ప‌డం, నిఖిల్ కూడా ఓకే అన‌డం జ‌రిగిపోయాయ‌ని టాక్‌. ప్ర‌స్తుతం నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే… స్వామి రారా 2 సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. నిజానికి సుధీర్ వ‌ర్మ ర‌వితేజ‌తో ఓ సినిమా చేయాల‌ని స్కెచ్ వేశాడు. స్క్రిప్టు కూడా రెడీ అయ్యింది. కానీ ఆ సినిమా ఆల‌స్యం అవ్వ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com