ఇది ఫిక్స్ : అఖిల్ – వంశీ సినిమా లేదు

అఖిల్ రెండో సినిమా వంశీపైడిప‌ల్లితోనే అని గంపెడాశ‌లు పెట్టుకొన్నారు అక్కినేని అభిమానులు. ఆ సినిమా ముందుకీ, వెన‌క్కీ ఊగిస‌లాడింది. ఇప్పుడు ఈ సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయ్యింది. అఖిల్ కోసం వంశీ కొన్ని క‌థ‌లు సిద్దం చేయ‌డం, అవి అఖిల్‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో అఖిల్ రెండో సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ డిలే అవుతూ వ‌స్తోంది. ఇక ఎంత‌కీ అఖిల్ నుంచి రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో… వంశీపైడిప‌ల్లి త‌న దారి తాను చూసుకొంటున్నాడ‌ట‌. కొన్ని క‌థ‌లు సిద్ధం చేసుకొని హీరోల కోసం అన్వేషిస్తున్నాడ‌ని టాక్‌. వంశీకి యాక్ష‌న్ క‌థ‌లు బాగా తీస్తాడ‌న్న పేరుంది. ఇప్పుడు న‌డుస్తోంది అదే ట్రెండ్‌. కాబ‌ట్టి వంశీ క‌థ చెప్తానంటే నో అని చెప్పే హీరో ఉండ‌క‌పోవొచ్చు. దానికి త‌గ్గ‌ట్టు ఊపిరి లాంటి స‌క్సెస్‌తో మ‌నోడు కూడా మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఆ న‌మ్మ‌కంతోనే.. ఇప్పుడు అఖిల్ ని వ‌దిలేసి.. కొత్త హీరోల వెంట ప‌డ్డాడు. అఖిల్ కూడా ఒక‌రిద్ద‌రితో క‌మిట్ అయిపోయాడ‌ని టాక్‌. అతి తొంద‌ర్లో అఖిల్ రెండో సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close