తెలంగాణ పద్దు రూ.2 లక్షల 90 వేల కోట్ల పైనే – మరి ఆదాయం ?

తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత ఏడాది కన్నా దాదాపుగా రూ. అరవై వేల కోట్లు ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదించింది. గత ఏడాది రూ.2,30,825.96 కోట్లు పద్దులను హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఆ మొత్తం రూ.2,90,396 కోట్లకు చేరింది. దానికి తగ్గట్లుగానే కేటాయింపులు సంక్షేమ పథకాలు భారీగా పెంచారు. నిధుల్లో అత్యధికంగా ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు కేటాయిచారు. అయితే ఇందులో దళిత బంధు పథకం నిధుల్లేవు. దళిత బంధు కోసం ప్రత్యేకంగా రూ. 17,700 కోట్లు కేటాయించారు. ప్రతీ నియోజవర్గంలో పదకొండు వందల మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు.

వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు , ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు , బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు , విద్య కోసం రూ.19, 093 కోట్లు. వైద్యం కోసం రూ.12,161 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించారు. రుణమాఫీకి కూడా రూ ఆరు వేల కోట్ల వరకూ కేటాయించారు.

అయితే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు కానీ.. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇవ్వ్లేదు. పన్నుల ఆదాయం.. అప్పులు… కేంద్ర నిధులు ఇలా అన్ని రకాలుగా ఆదాయం సమకూర్చుకుంటేనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమీకరించుకోగలరు. గత ఏడాది రూ.2,30,825.96 కోట్లతో ప్రవేశ పెట్టిన పద్దులోనే… కేటాయించిన పథకాలకు నిధులు ఖర్చు చేయలేదు. పెద్ద ఎత్తున ఆదాయం పెరిగిందని చెప్పినప్పటికీ దళిత బంధులకు కేటాయించిన నిధులు.. నిరుద్యోగ భృతికి కేటాయించిన నిధులే కాదు.. అనే పథకాలు.. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు విడుదల చేయలేకపోయారు.

ఈ ఏాడది అంత కంటే ఎక్కువగా నిధులు విడుదల కేటాయించారు. కానీ ఆదాయం ఎక్కడి నుంచి అనేదానిపై స్పష్టత లేదు.దీంతో విపక్షాలు సహజంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా అంకెల గారడీనేనని.. గత ఏడాది బడ్జెట్ ఎంత.. ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. కేటాయింపుల పరంగా చూస్తే.. ఈ బడ్జెట్ ప్రజాకర్షక బడ్జెట్ అనుకోవచ్చు. కానీ ఖర్చు చేయడంపైనే అసలు బడ్జెట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తం కాలం అధికారంలో ఉండదు.. నాలుగు నెలల ముందుగానే ప్రభుత్వం మారిపోతుంది. మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఇదే పద్దులు కొనసాగుతాయి. లేకపోతే తదుపరి ప్రభుత్వం ప్రయారిటీలు మార్చుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close