ప్రతిభతోనే పరిశ్రమలో పట్టు సాధించిన హీరోలు

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో కొత్త హీరోల హవా బాగా నడుస్తుందని చెప్పొచ్చు. పరిశ్రమతో సంబంధం లేని చిన్న హీరోలు కూడా మంచి హిట్ సినిమాలను తీస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈమధ్యనే వచ్చిన ఇద్దరు తెలుగు హీరోలు తమ నటనతో తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే రాజ్ తరుణ్ ముందుంటాడు. ఉయ్యాల జంపాల సినిమాతో అనుకోకుండా హీరోగా మారిన ఈ కుర్రాడు అసలు దర్శకుడవ్వాలనే ఆలోచనతో పరిచయాలు పెచుకున్నాడు. దాదాపు అర్ధ సెంచరీ దాకా షార్ట్ ఫిల్మ్స్ తీసి తన టాలెంట్ ఏంటో అందరికి తెలియ చేశాడు. అనుకోకుండా విరించి వర్మ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేస్తుండటం.. ఆ సినిమా హీరోకి ఎవరు నప్పకపోవడంతో చివరకు తానే చేయడం జరిగింది.

ఇక ఆ సినిమా హిట్ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమార్ 21ఎఫ్ ఇలా దర్శకుడిగా మారుదామని వచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు రాజ్. ఇక రాజ్ అంత సూపర్ సక్సెస్ అవ్వకపోయినా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేశాడు నాగశౌర్య. చేసే సినిమా మీద పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్న ఈ యువ కెరటం కూడా తీసిన సినిమాలను ప్రేక్షకులకు చేరువేయడంలో సఫలం అవుతున్నాడు. దిక్కులు చూడకు రామయ్య సినిమాతో పర్వాలేదనిపించుకున్న నాగశౌర్య ప్రస్తుతం నందిని రెడ్డి కళ్యాణ వైభోగమే సినిమాలో నటిస్తున్నాడు. అదే కాకుండా మెగా హీరోయిన్ నిహారిక తెరంగేట్రం చేస్తున్న ‘ఒక మనసు’ సినిమాలో కూడా హీరో నాగశౌర్య కావడం విశేషం.

అటు రాజ్, ఇటు నాగ శౌర్య ఇద్దరు ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు మంచి పోటీ ఇస్తున్నారు. దశాబ్ధ కాలంగా సినిమాలు కనీసం ఒక్క హిట్ మొహం చూడని హీరోలు వీరిద్దరిని చూసి కుళ్లు కుంటున్నారనే చెప్పాలి. ప్రస్తుతం రాజ్ తరుణ్ వర్మ , మంచు విష్ణు సినిమాలు చేస్తుంటే.. నాగ శౌర్య భారీ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ తీయబోయే సినిమాలో హీరోగా ఓకే అయ్యాడు.

ప్రతిభ ఉంటే చాలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తెలుగు పరిశ్రమలో రాణించొచ్చని ఈ ఇద్దరు హీరోలు చాటిచెప్పారు. ప్రస్తుతం ఫుల్ ఫాం మీదున్న ఇద్దరు హీరోలు కెరియర్ ఇలానే సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close