నిఖిల్ ను కాదన్న స్వాతి.. కారణాలేంటో..?

కెరియర్ అంతంత మాత్రంగా సాగుతున్న సమయంలో నిఖిల్, స్వాతిలకు సుధీర్ వర్మ ‘స్వామి రారా’ హిట్ మంచి జోష్ ఇచ్చింది. ఇక అదే ఊపుతో కార్తికేయ అంటూ వచ్చి మరో హిట్ వారి ఖాతాలో వేసుకున్నారు. రెండు వరుసెంట హిట్లు పడ్డ ఈ కాంబినేషన్ అంటే దర్శక నిర్మాతలకు కూడా క్రేజే. అందుకే నిఖిల్ తర్వాత తీసే సినిమాలో హీరోయిన్ గా ముందు స్వాతిని అడిగారట సదరు దర్శక నిర్మాతలు.

నిఖిల్ హీరో అని చెప్పగానే నిఖిల్ అయితే తాను చేయను అనేసిందట. అరె విచిత్రం ఇద్దరు మంచి జోడీ అనే నిర్మాత ఆమె డేట్స్ కోసం వస్తే స్వాతినేమో నిఖిల్ అయితే చేయనని తెగేసి చెప్పడంతో ఆశ్చర్య పోయాడట. స్వాతి సినిమా చేయనని చెప్పడానికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు ఫిల్మ్ నగర్ సర్కిల్స్. సినిమాలో స్వాతిది లీడ్ హీరోయిన్ పాత్రే అయినా ఇంకో ఇద్దరు ముద్దుగుమ్మలు సినిమాలో ఉన్నారట.

అయితే వారితో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే స్వాతి సినిమా చేయనని చెప్పిందట. అన్నట్టు స్వాతి కాకుండా ఇందులో నటిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు ఇద్దరమ్మాయిలతో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాధించిన కేథరిన్ థెరిసా. కేథరిన్ తో పోటీ ఎందుకో అనుకుందో ఏమో స్వాతి నో చెప్పడంతో కాస్త ఆలోచనలో పడ్డారట దర్శక నిర్మాతలు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలతో ప్రేక్షకులముందు వచ్చే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close