తెలుగు రాష్ట్రాల్లో తమిళ షూటింగ్‌లు వద్దంటున్న రోజా భర్త !

రోజా భర్త ఆర్కే సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఆయన ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదని అగ్రహీరోలందరూ హైదరాబాద్ , విశాఖల్లో షూటింగ్‌లు చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించారని.. తమిళ సినిమాల షూటింగ్‌లు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. అజిత్ ఇంకా స్పందించాల్సి ఉందంటున్నారు.

కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్, విశాఖల్లో జరుగుతున్నాయి. ఇది ఫెప్సీ పేరుతో ఓ సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్కే సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండటం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగ్‌లు చేయడానికి… పనికిరామా అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు .

ఆమెతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించి ప్రముఖుల్ని కలుస్తున్న సెల్వమమి… చెన్నై వెళ్లి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాల షూటింగ్‌లు వద్దని రచ్చ చేస్తున్నారు. నిజానికి దర్శకుడు అయిన సెల్వమణికి షూటింగ్ లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలుసు. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు. కానీ లేనిపోని వివాదం రేపి… తెలుగురాష్ట్రాల్లో షూటింగ్‌లు వద్దని రచ్చ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close