అమరావతిని ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మార్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కీలకమైన విజయం సాధించారు . క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ఆయన కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాల్లో విజయం సాధించారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ), లార్సన్ & టూబ్రో సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి.
అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం ఈ మూడు దిగ్గజ సంస్థల కేంద్రంగా జరగనుంది. 2026, జనవరి 1న దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఏఐతో పాటు క్వాంటం కంప్యూటింగ్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ రెండు అంశాల్లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తోది. దిగ్గజ సంస్థల కార్యకలాపాలను అమరావతిలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి నిర్మాణ కార్యకలాపాలు వేగంగా సాగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ ప్రారంభించడం కోసమే.. రెడీగా ఉన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్నారు. భారీ యంత్రాలను నిర్మాణ సంస్థలు రెడీ చేసుకున్నాయి. వచ్చే ఐదారు నెలల్లోనే అమరావతి నిర్మాణంలో కనిపించే అభివృద్ధి స్పష్టంగా ఉండే అవకాశం ఉంది.