గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన తాజాలిస్ట్‌లో పెండింగ్ సీట్లన్నింటికీ అభ్యర్థుల్ని ప్రకటించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన అందుకు అంగీకిరంచలేదు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును ఖరారు చేశారు. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చీపురుపల్లి ఖరారు చేశారు.

పెండింగ్ ఉన్న ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించారు. అరకు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించంతో పాడేరుకు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థి అయ్యారు. అద్దంకి, దర్శిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గొట్టిపాటి నర్సయ్య కుమార్తె ఈమె. గొట్టిపాటి రవికుమార్ కు సమీప బంధువు.

నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టినా చంద్రబాబు అంగీకరించలేదు. ఇక టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అందరూ ఊహించినట్లుగానే గుంతకల్లు నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నుంచి టీడీపీ తరపున వీరభద్రగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతపురం అర్బన్ కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేతకు అవకాశం కల్పించారు.

గతంలోనే కదిరి నియోజకవర్గానికి కందికంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదా దేవిని అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి కారణం కందికుంట వెంకట ప్రసాద్ పై కొన్ని కేసుల్లో శిక్ష పడి ఉండటమే. సాంకేతిక సమస్యలు వస్తాయన్న కారణంగా ఆయన భార్యకు చాన్సిచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆ శిక్షలన్నిటినీ కొట్టి వేసింది. దీంతో లైన్ క్లియర్ కావడంతో.. కందికుంట .వెంకట ప్రసాదే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థి పేరును టీడీపీ హైకమాండ్ మార్చింది

పెండింగ్ ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు , ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి , అనంతపూరం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్‌ రెడ్డిని ఖరారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close