మండలిలో టీడీపీ తిరస్కరిస్తే ..?

రాజధాని మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ.. శాసనమండలిలో బిల్లును అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. టీడీపీ వ్యూహం ఏమిటో సీక్రెట్‌గా ఉంచారు. టీడీపీ మొత్తం మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకుంది. తిరస్కరించడం, రెండో సారి సెలక్ట్ కమిటికీ పంపడం లేదా.. మొదటి సారి బిల్లు వచ్చినప్పుడే సెలక్ట్ కమిటీకి పంపడం. ఎ వ్యూహం ప్రకారం చూసినా.. బిల్లు ఆమోదం పూర్తి కాదు. టీడీపీ వ్యూహాలకు వైసీపీ.. ప్రతి వ్యూహాలు అమలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీని కన్విన్స్ చేయడానికి ప్రభుత్వానికి చెందిన కొంత మంది ప్రయత్నిస్తున్నారు. అయితే.. కన్విన్స్ అయ్యే సూచనలు లేవుకాబట్టి… ఆర్డినెన్స్ జారీ చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. ఆర్డినెన్స్ జారీపై ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

అయితే ఆరు నెలల్లోపు చట్టం చేయాలి. అయితే.. ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. ఇది సున్నితమైన అంశం కాబట్టి… గవర్నర్.. ఈ ఆర్డినెన్స్ ను కేంద్రం పరిశీలనకు పంపితే.. వైసీపీ వ్యూహాం తేడా కొట్టినట్లవుతుంది. పైగా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఒక వేళ కోర్టు స్టే ఇస్తే.. మొత్తం ప్రక్రియ నిలిచిపోతుంది. అందుకే.. మండలిలో టీడీపీ బిల్లును అడ్డుకుంటే.. రాజకీయంగా ఏం జరుగుతుందో చూస్తారంటూ.. మంత్రులు బెదిరింపులు కూడా ప్రారంభించారు. మహా అయితే మండలిని రద్దు చేస్తారని.. తమకు కూడా అదే కావాలని.. టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

అయితే మండలిని రద్దు చేయాలన్నా.. కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. దానికి ఐదారు నెలల సమయం పడుతుంది. అదే సమయంలో.. మండలిలో.. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకునే అవకాశాలపై.. వైసీపీ పెద్దలు.. తర్జనభర్జన పడుతున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపితే.. ప్రభుత్వ వేగానికి కళ్లెం పడినట్లే. కానీ.. అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి… తరలింపు పనులు కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close