పరామర్శకు దండయాత్రగా వెళ్తారా ?. రైతులకు సమస్యలు ఉంటే పరామర్శించడానికి పది వేల మందిని సమీకరించి మార్కెట్ యార్డ్లో రచ్చ చేస్తారా? అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు విధ్వంసకర శక్తులుగా మారారని అంటున్నారు. కానీ అలా చేయాలంటే.. చట్టపరంగా భయం లేకపోవడం కారణం అనుకోవాలి. చట్టపరంగా కూడా ఏమీ చేయలేరని అనుకోవడం వల్లనే వారు అలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రైతుల సమస్యలకు అసలు కారణం వైసీపీ నేతలే. అయినా ఆ విషయాల్లో చర్యలు తీసుకోలేకపోతున్నారు.
తోతాపురి సిండికేట్ పెద్ద.. పెద్దిరెడ్డినే !
చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు రేటు లేదని జగన్ రెడ్డి మార్కెట్ లో రైతుల పరామర్శలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ చేశారు. అసలు మార్కెట్ అంతా ఆయన గుప్పిట్లో ఉంది. ఆయన బంధువుల పేరుతో పల్ప్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఎవరైనా రైతులు ఆయన … ముఠా చెప్పినట్లుగానే మామిడి కాయలు పరిశ్రమలకు సరఫరా చేయాలి. ఎంత రేటు అనే నిర్ణయం వారి గుప్పిట్లోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ముందుగానే రైతులకు కొంత మొత్తం ఇచ్చి..ఒప్పందాలు కూడా చేసుకుంటారు. రేటు కూడా ముందు ఖరారు చేసుకుంటారు. కొత్తగా రేటు తగ్గిస్తే రైతులను మోసం చేసినట్లే అవుతుంది.
అత్యధిక మంది రైతులకు ముందుగానే పల్ప్ కంపెనీలతో ఒప్పందాలు
చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతులతో పల్ప్ కంపెనీలు ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుంటాయి. వారి పంట తమకే సరఫరా చేయాలని.. కొంత అడ్వాన్స్ ను రుణంగా ఇస్తాయి. పంటను కంపెనీకి సరఫరా చేసినప్పుడు అంగీకరించిన ధర ప్రకారం చెల్లిస్తారు. ఈ పంట ఈ సారి ఎక్కువగా ఉంది. ఒప్పందాలు చేసుకున్నదాని ప్రకారం సరఫరా చేసినా ఇంకా భారీగా పంట ఉండటంతో కంపెనీలు తక్కువ ధరకు కొంటున్నాయి. ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు సంతృప్తి స్థాయిలో ధర కల్పించేలా చేసింది. అందుకే ఇప్పుడు కంపెనీల వద్ద కానీ.. మార్కెట్లో కానీపెద్దగా మామిడి నిల్వలు లేవు.
రాజకీయం కోసమే జగన్ రెడ్డి పర్యటనలు
జగన్ రెడ్డి పదేళ్ల పరిపాలనలో ఎప్పుడూ మామిడి రైతులకు సబ్సిడీ లేదా అదనపు మొత్తం చెల్లించాలన్న ఊసే లేదు. ఆయన హయాంలో రైతులకు భారీ పంట ఎప్పుడూ రాలేదు. వచ్చినా.. పెద్దిరెడ్డి గుప్పిట్లో పెట్టుకుని మొత్తం రైతుల్ని ఒకే రేటుకు దోపిడీ చేశారు. ఒక్కరూ నోరు మెదిపేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన దోపిడీ చేస్తూ.. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ముందుగా ఆయనకు చెందిన కంపెనీల్లో సోదాలు చేసి.. చర్యలు తీసుకుంటే.. పరిస్థితి సద్దుమణిగేదన్న అభిప్రాయం ఉంది. కానీ చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు రైతులపై జగన్ దండయాత్రకు బయలుదేరారు.