జగన్‌ చుట్టూ ఉచ్చు బిగిస్తూనే ఉన్నారింకా!

తెలుగుదేశం పార్టీ వారు ప్రకటించిన డెడ్‌లైన్‌ అచ్చంగా కార్యరూపంలోకి వస్తుందో లేదో తెలియదు. కాకపోతే జగన్‌ చుట్టూ ఇంకా ఉచ్చు బిగించడం మాత్రం తెలుగుదేశం పార్టీ మానినట్లు కనిపించడం లేదు. తనేమో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని  అందుకని పాలక పక్షం నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వచ్చేస్తే చాలునని జగన్‌ తన అవగాహన రాహిత్యం మొత్తం బయటపెట్టుకుంటూ మాట్లాడారు. అయితే ఆ మాటలతో రెచ్చిపోయి.. వైకాపా పతనానికి కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ వైకాపా వికెట్లు తీయడంలో హాఫ్‌ సెంచరీ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుంది అని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించడం గమనిస్తే వారి ఉద్దేశం మనకు స్పష్టం అవుతుంది.

తెలుగుదేశం పార్టీ ఈ లక్ష్యసాధనలో సఫలం అవుతుందా లేదా? అనేది వేరే సంగతి. కానీ యాభైమంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేయడం కాకపోయినప్పటికీ ఆ మోతాదులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు భారీ నష్టం కలిగించడం మాత్రం తథ్యం అని పలువురు భావిస్తున్నారు. నేను అనుకుంటే గంటలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనే డైలాగును ప్రయోగించడం ద్వారా తెలుగుదేశం వ్యూహకర్తలను అందరినీ జగన్‌ చాలా రెచ్చగొట్టాడనే సంగతి స్పష్టం.

ఇప్పుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా అదే అంటున్నారు. మెజారిటీ తక్కువ ఉన్న జగన్‌, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధమవుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు తాము నిర్ణయం తీసుకున్నాం అని ఆయన ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. కేఈ మాటల్లో దాపరికం ఉండడం కూడా లేదు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వచ్చినప్పుడు కూడా మీ నాన్న తెదేపాలో ఉండగా.. మేం ఎంత హెల్ప్‌ చేశామో అంతా వివరించి చెప్పేసరికి ఆయన రావడానికి ఒప్పుకున్నారు అని స్వయంగా కేఈ చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఒక్కొక్క రకం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో తమ టార్గెట్‌ హాఫ్‌ సెంచరీ వికెట్లు పడగొట్టడం అనే సంకేతం ఆయన ఇవ్వాళే బయటపెట్టారు. ప్రతిపక్షహోదా లేకపోవడం అంటే.. పది శాతం సీట్లు కూడా ఉండకూడదు. 175 సీట్ల ఏపీ అసెంబ్లీలో హోదా కోల్పోవడం అంటే 18 సీట్లకంటె తక్కువ ఉండాలి. అంటే 67 సీట్ల వైకాపాలో 50 మందిని ఫిరాయింపజేస్తే తప్ప ఆయన చెబుతున్నట్లుగా జరగదు. మరి ఆయన మాటలు ఎలా సాధ్యమవుతాయో వేచి చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close