అమరావతిపై ముంపు స్కెచ్..! టీడీపీ ఆధారాలు రెడీ..!?

ఎగువ నుంచి వచ్చిన వరదతో ప్రజలను ముంచి.. రాయలసీమను ఎండబెట్టిన అంశంపై… తెలుగుదేశం పార్టీ… ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది రాయలసీమకు నీరు అందకపోయినా పర్వాలేదనుకుని..ఓ ప్రణాళిక ప్రకారం.. అమరావతి గ్రామాలను ముంపు గ్రామాలుగా చిత్రీకరించే.. పెద్ద కుట్ర జరిగిందని.. టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ఈ మేరకు.. టీడీపీ.. అసలు మొత్తం ఏం జరిగిందో వివరించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… వరదల పరిస్థితి, కేంద్రం హెచ్చరికలు, ఎప్పుడు ఏం చేయాలి..? ఏం చేశారన్నదానిపై… పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

రాజధానికి ముంపు ముద్ర వేసేందుకే వరద నియంత్రణ..!?

వరదలు ఇలా వచ్చి అలా వెళ్లక ముందే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ఓ ప్రణాళిక ప్రకారం.. రాజధాని ముంపు ప్రాంతమంటూ… ఆరోపణలు ప్రారంభించింది. రాజధానిని తరలించేందుకు ఆలోచిస్తున్నామని సాక్షాత్తూ… పురపాలక మంత్రే ప్రకటించారు. దీంతో.. తెలుగుదేశం పార్టీ.. తాము ముందు నుంచీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావిస్తోంది. వరదను… అమరావతి గ్రామాలపైకి పంపేలా.. పకడ్బందీ ప్రణాళిక వేశారని.. టీడీపీ ఆరోపిస్తోంది. వరద మేనేజ్‌మెంట్.. అలానే చేశారని… వరద నీరు వృధాగా పోయినా పర్వాలేదు.. రాజధాని ముంపు గ్రామాల్లోకి నీరు పంపారని.. వారు నమ్ముతున్నారు.

అసలేం జరిగిందో మొత్తం బయట పెట్టనున్న టీడీపీ..!

టీడీపీ ఇప్పటికే.. వరద ఎప్పుడు వచ్చింది..? ఎలా వచ్చింది..? రాయలసీమకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి..? ఎప్పుడు విడుదల చేశారు..? కేంద్ర జలసంఘం.. ఎప్పుడెప్పుడు హెచ్చరికలు జారీ చేసింది..? వాటిని ప్రభుత్వం ఎందుకు పాటించలేదు..? అనే అంశాలపై.. అధికారిక ఉత్తర్వులు సహా.. మొత్తం రికార్డులను.. తెలుగుదేశం పార్టీ సేకరించింది. వీటన్నింటినీ ప్రజల ముందు పెట్టి… వరదల విషయంలో.. ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజలను బలి చేయాలనుకుందో… వివరించాలని నిర్ణయించుకుంది.

సొంత ప్రజలకు ఏపీ సర్కార్ కుట్ర చేసిందా..?

రాజధాని విషయంలో.. ఇప్పటికే వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ తీరు… సొంత ప్రజలపై కుట్ర పన్నినట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వరద వచ్చినప్పటికీ.. రాయలసీమకు ముందస్తుగా నీరు విడుదల చేయకపోవడం… కుట్రతో… కోస్తాలో.. పంట పొలాలను ముంచేశారన్న మరో అభిప్రాయం… బలంగా ప్రజల్లో ఏర్పడటంతో.. టీడీపీ మరింత దూకుడుగా వెళ్లాలనుకుంటోంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పని చేయాలి కానీ.. ఇలా కుట్ర పన్ని… అధికార దుర్వినియోగం చేసి.. ప్రజలను ముంచాలనుకుందనే విషయాన్ని పకడ్బందీగా.. ప్రజల ముందు పెట్టాలని.. టీడీపీ నిర్ణయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com