రైతు సమస్యలను ఎజెండా చేసుకున్న తెలంగాణ బీజేపీ..!

కరోనాపై పోరాటంలో తెలంగాణ సర్కార్‌ను… విమర్శించడం కంటే… రైతు సమస్యల కోసం పోరాడితేనే ఎక్కువ మైలేజీ వస్తుందని… తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్.. ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రైతుల్ని ఆదుకోవాలంటూ నిరాహారదీక్ష చేశారు. అన్ని చోట్లా.. బీజేపీ నేతలందరూ.. తమ తమ ఇళ్లలో దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ పంటల కొనుగోలు సీజన్ నడుస్తోంది. ప్రభుత్వమే అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే.. కొన్ని కొన్ని చోట్ల.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. గిట్టుబాటు ధర ఇచ్చి వారు ఊళ్లలోనే కోనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే.. రైతులకు తరుగు పేరుతో.. తడి పేరుతో… అధికారులు లేనిపోని కొర్రీలు పెడుతూండటంతో… పెద్దగా కొనుగోలు జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సిరిసిల్లలో ఓ చోట రైతులు… ధాన్యాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీన్నే బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. బండి సంజయ్ దీక్షతో… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారులే దళారీలుగా మారారని … క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని బండి సంజయ్ అంటున్నారు.

వైరస్ ప్రభావం.. లాక్ డౌన్ కారణంగా.. దేశం మొత్తం రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి అవకాశాలు నిలిచిపోవడం… రవాణా పూర్తిగా ఆగిపోవడంతో దగ్గర ఉన్న సిటీ మార్కెట్లలో ‌అమ్ముకుందామనుకున్నా సాధ్యం కాని పరిస్థితి. ఈ సీజన్లలో వచ్చే పుచ్చకాయ, మామాడి, ద్రాక్ష వంటి పళ్ల రైతులు కూడా… అమ్ముకోలేక తంటాలు పడుతున్నారు. పంటలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి రైతుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. వారి కోసం పోరాడి.. మైలేజీ తెచ్చుకునేందుకు తెలంగాణ బీజేపీ.. గట్టిగానే ప్రయత్నిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close