నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఇకపై పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన ఎగ్జిబిటర్లు వార్నింగులు లాంటి డిమాండులు నిర్మాతల ముందు ఉంచారు.

ఎగ్జిబిటర్లుకు పర్సంటేజీ ఇవ్వాలనేది మొదటి డిమాండ్. ఇకపై అద్దె ప్రాతిపాదికన సినిమాలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పారు. మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ చెల్లిస్తేనే షోలు. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇచ్చిన ఎగ్జిబిటర్లు .. కల్కి 2898 ఏడీ, పుష్ప 2, గేమ్ ఛేంజర్‌, భారతీయుడు 2 చిత్రాలకు కు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. ఇతర సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని తీర్మానించారు.

ఇదే సందర్భంలో ఓ ఆరోపణ కూడా చేశారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని గాంబ్లింగ్ గా మార్చారని, బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని, అందుకే ఇకనుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించమని తేల్చేశారు. మరి ఎగ్జిబిటర్లు డిమాండ్లపై నిర్మాతలు స్పందన ఎలా వుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close