రేవంత్ సన్మానం చేస్తే కేసీఆర్ వద్దంటారా ?

తెలంగాణ సాధనలో మీది ప్రముఖ పాత్ర… వచ్చేయండి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ చాలా మందిని పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్ కే వస్తే ఎలా ఉంటుంది ?. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఆహ్వాన్ని కేసీఆర్‌కు పంపబోతోంది.

జూన్ రెండున భారీగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తున్న సోనియా గాంధీని అత్యంత భారీగా సన్మానించబోతున్నారు. ఇదే వేదికపై కేసీఆర్ ను కూడా సన్మానించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు.తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని అంటారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ కు అధికారిక ఆహ్వానం అందిన తర్వాత బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది. ఒక వేళ ఒప్పుకుంటే మాత్రం.. కేసీఆర్ ను రేవంత్ సన్మానిస్తారు. అదో ప్రత్యేక ఘట్టంగా మిగిలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close