ఆర్టీసీపై హైకోర్టులో ఇరుక్కుపోయిన తెలంగాణ సర్కార్..!

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అడ్డంగా బుక్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఆర్టీసీ.. మరో వైపు ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. కొద్ది రోజలు క్రితం.. ప్రభుత్వం… ఆర్టీసీకి తాము కొంత మొత్తం ఇవ్వాలని నివేదిక సమర్పించింది. నిన్న దాఖలు చేసిన కౌంటర్‌లో ఆర్టీసీనే తమకు ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ మరో భిన్నమైన వాదనతో.. నివేదిక ఇచ్చారు. దీంతో ఇవన్నీ అవాస్తవాలేనని.. న్యాయమూర్తి మండిపడ్డారు. అధికారులే అవాస్తవాలు చెబుతున్నారు… ఈ పరిస్థితిని తాను ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపోయారు. ఐఏఎస్‌ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరమని.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా అని హైకోర్టు ప్రశ్నించింది.

దీంతో.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు రికార్డుల ఆధారంగా…తక్కువ సమయంలో నివేదిక రూపొందించామని.. క్షమించాలని కోరారు. దీనిపైనా హైకోర్టు మండిపడింది. క్షమాపణ కోరడం కాదని కోర్టులకు వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను మూడు రాష్ట్రాల్లో పనిచేశా..హైకోర్టుకు ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదని న్యాయమూర్తి మండిపడ్డారు. కేబినెట్‌కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని… సీఎంతో తప్పుడు ప్రకటనలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బాస్‌నే తప్పుదోవ పట్టించారు.. మాకు నిజాలు చెబుతున్నారని ఎలా నమ్మాలని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఈ మొత్తం విచారణలో కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ఇంత వరకూ విభజించలేదని… కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన … అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని .. టీఎస్ఆర్టీసీని కేంద్రం ఇంకా గుర్తించలేదన్నారు. ఆర్టీసీ రీఆర్గనైజేషన్‌కు తమ అనుమతి కోరలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికీ.. ఏపీఎస్ఆర్టీసీ షెడ్యూల్ 9 కిందకు వస్తుందన్నారు. కేంద్రం అనుమతి పెండింగ్‌లో ఉండగా.. కొత్త స్వతంత్ర సంస్థ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ న్యాయవాదుల్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి హైకోర్టు… మూడు రోజుల గడువు ఇచ్చింది. 11వ తేదీలోపు కార్మికులతో చర్చలు జరిపి.. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే… కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయని విస్మరించొద్దని హెచ్చరికలు కూడా చేసింది. సమస్య పరిష్కరించకపోతే… తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close