కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా లక్షణాలతో చనిపోయిన వారికి టెస్టులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కోర్టు కొట్టి వేసింది. హైరిస్క్ అవకాశాలున్న వారికి పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ టెస్టులు చేస్తున్నారని… మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలని కూడా ఆదేశించింది.

పీపీఈ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో, ఎంత మందికి ఇచ్చారో .. జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలను హఠాత్తుగా తగ్గించేశారని పిటిషన్లు వేశారు. గతంలో ఇదే అంశంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరవాత టెస్టుల సంఖ్యను పెంచారు. అంతకు ముందు రోజూ.. మూడు నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ఆ తర్వాత నుంచి 40, 50 కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాలు చేస్తున్న స్థాయిలో టెస్టులు లేవని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా… తెలంగాణలో టెస్టుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాసింది.

ఆ లేఖలు హైలెట్ అయ్యాయి. కేంద్రం రాసిన లేఖలపై… తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఫైరయ్యారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే.. టెస్టులు చేస్తున్నామని… వాదించారు. ఈ పరిణామాలన్నింటి మధ్య… హైకోర్టు తాజాగా.. టెస్టుల వివరాలు ఇవ్వాలని ఆదేశించడం.. ఆసక్తికరంగా మారింది. కేసుల సంఖ్యను తక్కువగా చూపడానికి తెలంగాణ సర్కార్… టెస్టులే నిలిపివేసిందని.. విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లయింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటా కూడా కుమారుడికే వైసీపీ కండువా కప్పించబోతున్నారు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ... వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని...

నితిన్‌కి ‘చెక్’ పెట్టేశారు

నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌కుల్‌, ప్రియా వారియ‌ర్ క‌థానాయిక‌లు. ఈ సినిమాకి `చెక్‌` అనే టైటిల్ పెట్ట‌నున్నార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు...

దర్యాప్తుపై స్టే సరికాదు..చట్టం తన పని తాను చేసుకోనివ్వాలి : సుప్రీంకోర్టు

చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని.. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూ వస్తున్నామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ...

చీరలతో మహిళల మనసు గెలిచేలా కేటీఆర్ ప్లాన్..!

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ సందడి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ సారి చీరను సిద్ధం చేయించారు. పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. గతంలో చీరల పంపిణీ...

HOT NEWS

[X] Close
[X] Close